వేదము వేంకటరాయ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 75:
9. '''ఇట్లు కొందఱు వదాన్యులు ధనమిచ్చినను, ఒకప్పటికి కూడిన ధనము ముద్రణాదికృత్యములకు పర్యాప్తముగాక యుండినది. ఆంధ్రగైర్వాణగ్రంథములనే రమారమి రు 900 లకు కొనవలసివచ్చినది. దుర్దైవవశమున మందదృష్టినైతిని. దానంజేసి కార్యసహాయులకై రు 1500 ఎక్కుడుగానే వ్యయమయినది. ఆసమయమున, నేను రిక్తుడను రుగ్ణుడను, నిరాయతిని బహుకుటుంబిని, ఉక్తకారణములచేత బహువ్యయుండనుంగాన, ముద్రణమునకు తక్కువపడిన ధనమును వ్యయించుటకు స్వశక్తి లేకయు నుంటిని. దానినెఱింగి యీ గ్రంథము తప్పకముద్రితమగుగాకయని నెల్లూరుజిల్లా కావలి తాలుకా ఇందువూరుగ్రామ్యవాస్తవ్యులు, భూస్వాములు శ్రీయుతులు ఎఱబ్రోలు రామచంద్రారెడ్డిగారు ....... నాకు ఏతద్గ్రంథ ముద్రణపూర్తికై అప్పుడప్పుడు రు. 2500 ల పరిమితిం జెందువఱకు విరాళమొసంగిరి.' ఈవిధముగా నీగ్రంథము 1927 సం జులయినెలలో వెలువడినది. 'చేసెదనింకదత్పరత సేవలు చూడికుడుత్త దేవికిన్‌' అని 1913 సం కావించిన ప్రతిజ్ఞను ఇన్నాళ్ళకు చెల్లించుకొని 'చేసితినిప్డు తత్పరత సేవలు చూడికుడుత్తదేవికిన్‌' అని ముద్రించినారు. ఆముక్తమాల్యద ముద్రితమై వెలువడినప్పుడు వారిహర్షమునకు మేరలేదు.''
(పుట. 184)
 
10. '' ...... ప్రతిదినమును ప్రొద్దున నొకటి రెండుగంటలు శరీరముపై స్పృహయుండెడిది. తర్వాత జ్వరము వచ్చెడిది. ఒడలు తెలియనిస్థితి. గంజి ఆహారము. ఉపనయనానంతరము నేను చెంతకుపోయితిని. 'మీకు, ఒంట్లో ఎట్లున్నదండీ?' అని యడిగితిని 'పరమ పదం, పరమపదం' అనిమాత్రము చాలకష్టముతో చెప్పగల్గిరి. ఆవెనుక వారికి చైతన్యము లేదు. మరల తెల్లవారులోపల 1929 సం. (1929) జూనునెల 18 తేది మంగళవారము వేకువను 5-45 గంటలకు పరమపదించిరి.''
 
*మూలము:https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Vedhamu_Venkataraya_Shastrula_Vari_Jeevitha_Charitra_Sangrahamu.pdf/132
* వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము...రచయిత వేదము వేంకటరాయ శాస్త్రి ,సంవత్సరం 1943