"తిరుపతి" కూర్పుల మధ్య తేడాలు

చి
 
ఇక్కడే శ్రీ వారి పాదాల మండపం వున్నది. ఇక్కడ శ్రీవారి పాదుకలు, వెండివి వున్నాయి. వాటిని భక్తులు కొంత రుసుం చెల్లించి తమ నెత్తిన పెట్టుకొని ఇస్తుంటారు. అదే విధంగా ఇక్కడ శ్రీక్రిష్టదేవ రాయలచే నిర్మితం అయిన పెద్ద గోపురం కలదు.
*'''[[శ్రీవారి మెట్టు]]:''' తిరుమల అతిత్వరగా నడక ద్వారా వెళ్ళు దారి.
 
*'''చంద్రగిరి కోట:''' తిరుపతికీ [[చంద్రగిరి]] పాలకులకూ అవినాభావ సంబంధం ఉండేది. తిరుమల ఆలయంలో నైవేద్య ఘంటికా రావాన్ని విన్న తర్వాతనే చంద్రగిరి పాలకులు ఏ ఆహారాన్ని అయినా ముట్టేవారట. అలనాటి [[చంద్రగిరి]] వైభవాన్ని కనులారా చూడాలంటే... అక్కడ ప్రతిరోజూ జరిగే లైట్‌ అండ్‌ సౌండ్‌ షోకు వెళ్ళాల్సిందే.
*'''[[హార్సిలీ కొండలు|హార్సలి హిల్స్]]:''' తిరుపతికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1265 మీటర్ల ఎత్తులో హార్స్‌లీహిల్స్‌ ఉంది. అంత ఎత్తున విడిదిగృహాన్ని కట్టించుకున్న అప్పటి కడపజిల్లా కలెక్టర్‌ డబ్ల్యు.డి.హార్స్‌లీ పేరు మీద ఆ కొండల ప్రాంతాన్ని ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆంధ్రా ఊటీగా పేరుపొందింది.
*'''[[తలకోన]]:''' పచ్చటి అటవీ అందాలకు ఆలవాలం తిరుమల గిరులకు ముఖద్వారం తలకోన. 270 అడుగుల ఎత్తు నుంచి దుమికే అక్కడి జలపాత సౌందర్యాన్ని చూసితీరాల్సిందే కానీ వర్ణించడానికి పదాలు చాలవు. తిరుపతి నుంచి ఇక్కడికి 40కిలోమీటర్ల దూరం.
*'''[[కళ్యాణీ డ్యాము]] /[[కళ్యాణి ఆనకట్ట]]:'''తిరుపతి పట్టణ ప్రజల తాగునీటి అవసరమునకు ఇది సువర్ణముఖి మీద తిరుమల కొండనానుకొని కట్టబడింది. ప్రస్తుతము తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తాగే నీరు పట్టణానికి అందిస్తున్నారు.
*'''[[కాణిపాకం]] :''' తిరుపతికి సుమారు 90 కిలోమీటర్లు దూరంలో ఉన్నది.
*'''[[శ్రీకాళహస్తి]]:''' తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది.
*'''[[తిరుచానూరు]]:''' తిరుపతికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో వున్నది.
*'''[[యోగిమల్లవరం]]:'''ఈ గ్రామం తిరుపతికి 4 కి.మీ. దూరం లో వున్న అతి పురాతన గ్రామం. ఇక్కడ అతి పురాతన శివుని దేవాలయం వుంది,మూల విరాట్టు పరాశరేశ్వర స్వామి
*'''[[శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట ]]:'''తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరం లొ వున్నది.అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంట లో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొలాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అందమైన చిన్న ఆలయం ఇది.
 
74

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1744781" నుండి వెలికితీశారు