ఫిల్మ్: కూర్పుల మధ్య తేడాలు

→‎వర్ణపట గుర్తింపు: రెండవ ప్యారా
పంక్తి 22:
 
===వర్ణపట గుర్తింపు===
మొదట రూపొందించిన ఫోటోగ్రఫిక్ పళ్ళాలు మరియు ఫిలిం లు నీలి రంగు, ఊదా రంగు మరియు పరారుణ కాంతిని మాత్రమే గుర్తించగలిగేవి. ఫలితంగా దృశ్యంలోని వర్ణ విలువలు ఊదా రంగు గాజు ముక్క ద్వారా చూస్తే ఎలా ఉండేవో అలా నమోదయ్యేవి. నీలి రంగులో ఉండే ఆకాశం, తెల్లగా, మేఘాలు ఉన్ననూ ఖాళీగా కనబడేది. ఆకుపచ్చ రంగులు లేతగా, పసుపు పచ్చ మరియు ఎరుపు రంగులు దాదాపు నలుపుగా కనబడేవి. ముఖం పైన చర్మం ఉన్న రంగు కంటే నలుపుగా, ముఖం పైన ఉండే ఎత్తుపల్లాలు లేదా మచ్చలు అతిశయంగా కనబడేవి. చక్కగా అగుపడే ఆకాశాన్ని ఇతర ఛాయాచిత్రాల నుండి తెచ్చి కావలసిన ఛాయచిత్రంలో ముద్రించటం, మచ్చలు మరియు ఎత్తుపల్లాలని తగ్గించటానికి ముఖాన్ని పౌడరుతో అద్దటందట్టించటం వంటివి ఛాయాచిత్రకారులు చేసేవారు.
 
1873లో హెర్మన్ విల్హెం ఫోగెల్ ఫోటోగ్రఫిక్ మిశ్రమానికి కొన్ని అద్దకాలను ఉపయోగించటం వలన ఫిలిం యొక్క వర్ణపట సూక్ష్మగ్రాహ్యతను ఆకుపచ్చ మరియు పసుపుపచ్చ రంగులకు విస్తరించవచ్చును అని కనుగొన్నాడు. మొదట ఈ అద్దకాల అస్థిరత వలన ఛాయాచిత్రం మసకబారినట్లు రావటం వలన ఇవి ప్రయోగశాలకే పరిమితమైననూ, 1883 నుండి వాణిజ్యపరంగా ఇవి విస్తృతి చెందాయి. వీటిని iscohromatic లేదా orthochromatic ఫిలిం లుగా వ్యవహరించేవారు. నీలిరంగును సరియైన పాళ్ళలో గుర్తించలేకపోవటం వలన, ఆ గ్రాహ్యతను విస్తృతపరచటానికి ఈ ఫిలిం తో పాటు పసుపు రంగు ఫిల్టరును, దీర్ఘ బహిర్గతాన్ని ఉపయోగించవలసి వచ్చేవి.
 
==ప్రాథమికాంశాలు==
"https://te.wikipedia.org/wiki/ఫిల్మ్" నుండి వెలికితీశారు