అమరచింత సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అమరచింత సంస్థానము''', ఇప్పటి [[మహబూబ్ నగర్]] జిల్లాలో 69 గ్రామాలు కలిగి దాదాపు 190 చ.కి.మీ.ల విస్తీర్ణములో వ్యాపించి ఉండేది. ఈ సంస్థానము యొక్క రాజధాని [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]]. 1901 జనాభా లెక్కల ప్రకారము 34,147 జనాభాతో మొత్తము 1.4 లక్షల రెవిన్యూ ఆదాయము కలిగి ఉండేది. అందులో 6,363 రూపాయలు [[నిజాము]]కు కప్పముగా కట్టేవారు. సంస్థానము యొక్క రాజుల నివాస గృహమైన ఆత్మకూరు కోట ఇప్పటికీ పఠిష్టముగా ఉన్నది. ఆమరచింత సంస్థానము చాలా పురాతనమైన సంస్థానము. సంస్థానము యొక్క దక్షిణ భాగమున [[గద్వాల సంస్థానము]] సరిహద్దున [[కృష్ణా నది]] ప్రవహిస్తున్నది. నదీ తీరము యొక్క ఎత్తు వలన నది జలాలు వ్యవసాయమునకు ఉపయోగించుటకు సాధ్యము కాదు. అమరచింత మరియు ఆత్మకూరు అంత్యంతఅత్యంత నాణ్యమైన మేలు మస్లిన్‌ బట్టతో నేసిన దస్తీలు, ధోవతులు, బంగారు మరియు పట్టు అంచులతో నేసిన తలపాగలకు ప్రసిద్ధి చెందినవి.
== భౌగళిక స్వరూపం ==
అమరచింత సంస్థానం ప్రస్తుతపు [[మహబూబ్ నగర్ జిల్లా]] లో [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]] రాజధానిగా ఉండేది. మొత్తం 69 గ్రామాలతో 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించివుండేదివ్యాపించి ఉండేది. సంస్థానానికి దక్షిణాన [[గద్వాల సంస్థానము]] ఉండేది, దక్షిణ సరిహద్దున [[కృష్ణానది]] ప్రవహిస్తూండేది.<ref name="ఆంధ్ర సంస్థానములు సాహిత్యపోషణ">{{cite book|last1=తూమాటి|first1=దొణప్ప|authorlink1=తూమాటి దొణప్ప|title=ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణ|date=ఆగస్టు 1969|publisher=ఆంధ్రవిశ్వవిద్యాలయం|location=విశాఖపట్టణం|pages=33-39|edition=1|language=తెలుగు|chapter=ముఖ్య సంస్థానములు}}</ref>
 
== చరిత్ర ==
కాకతీయుల కాలంలో [[గోన బుద్ధారెడ్డి]] గారి అధీనంలో [[వర్ధమానపురం]] ఉండేది. దానికి గోపాలరెడ్డి అను వ్యక్తి [[దేశాయి]] గా ఉండేవాడు. అతని అమూల్య సేవలకు గుర్తింపుగా బుద్ధారెడ్డి క్రీ.శ. 1292లో [[మక్తల్]] పరగాణనుపరగణాను గోపాలరెడ్డికి నాడగౌడికంగా ఇచ్చాడు. గోపాలరెడ్డి అనంతరం ఆయన రెండో కుమారుడు చిన్న గోపిరెడ్డి నాడగౌడికానికి వచ్చాడు. మక్తల్ తో పాటు మరో నాలుగు మహళ్ళు గోపిరెడ్డి నాడగౌడికం కిందికి వచ్చాయి. ఆ నాలుగింటిలో అమరచింత ఒకటి. ఈ చిన్న గోపిరెడ్డి మనువడి మనువడి పేరు కూడా గోపిరెడ్డే. ఇతనిని ఇమ్మడి గోపిరెడ్డి అని అంటారు. ఇతను క్రీ.శ. 1654 ప్రాంతానికి చెందినవాడు. ఇతని అన్నగారు సాహెబ్ రెడ్డి. వారసత్వంగా వచ్చిన అయిదు మహళ్ళలో సాహెబ్ రెడ్డికి మూడు మహళ్ళు పోగా, మిగిలిన రెండు మహళ్ళు వర్ధమానపురం, అమరచింత ఇమ్మడి గోపిరెడ్డి వంతులోకి వచ్చాయి. క్రీ.శ.1676 ప్రాంతంలో ఇమ్మడి గోపిరెడ్డి కుమారుడు సర్వారెడ్డి నాడగౌడికానికి వచ్చాడు. ఆ తర్వాత ఈ అమరచింత క్రమంగా వృద్దిచెంది సంస్థానంగా రూపొందింది<ref> సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటి రాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-32</ref>. సర్వారెడ్డి అభ్యుదయ విధానాలు కలవాడు. నీటి వనరులు పెంచడానికి పెద్దవాగుకు ఆనకట్ట కట్టించాడు. ఇతను ఔరంగజేబు సైన్యాలకు సాయం చేశాడు. తత్ఫలితంగా జండా, నగరా, 500 సవార్లు మొదలైన రాజలాంఛనాలు పొందాడు. ఇతని తరువాత మరో ఆరుగురు రాజులు ఈ సంస్థానాన్ని పాలించారు.
అమరచింత సంస్థాన వంశము యొక్క వారసులలో ఒకడైన రాజా శ్రీరాం భూపాల్‌ మరణించిన తర్వాత అతని భార్యకు న్యాయబద్ధముగా సంస్థానము యొక్క వారసత్వము సంక్రమించినది.
== సంస్థాన రాజుల వంశక్రమం ==
పంక్తి 20:
( 1676 )
==సంస్థానాధికారిపై తిరుపతి కవుల గ్రంథం ==
ఈ సంస్థానాన్ని తిరుపతి కవులు సందర్శించారు. ఇక్కడి ప్రభువులను కలుసుకోవాలనే వారి కోరికకు ధర్మాధికారిగా పనిచేసే ఒక పండితకవి అడ్డుతగిలాడు. వారికి వీరికి వాదన జరిగినది. పండితకవి ప్రభువులకు చాడీలు చెప్పి, వీరికి ప్రభువుల సత్కారాన్ని దూరం చేశాడు. దీనితో ఆగ్రహించిన జంటకవులు ఆ అధికారిని ''అధిక + అరి '' అని చమత్కరిస్తూ, అన్యోపదేశంగాఅన్యాపదేశంగా నిందిస్తూ 27 పద్యాలతో కూడిన లఘుకృతిని రచించారు. దీనికి ''శనిగ్రహం '' అని పేరు పెట్టారు. అందులో ఒక పద్యం....
<poem>
ధరణీ నాయకుడుత్తముండవని నిన్ ధర్మాధికారమ్మునం
దు రహిన్నిల్పుట తుచ్చ బుద్ధివయి క్రిందున్ మీదునుం గాన కె
ల్లరి కార్యమ్ములు పాడుసేయుటకె? నీ లక్ష్యమ్ము మా బోటు తెం
చరు చండాల! శనిగ్రహంబ! యిక మా సామర్థ్యంసామర్థ్య ముంజూడుమా!
</poem><ref>తెలుగులో తిట్టుకవిత్వం,రచన:విద్వాన్ రావూరి దొరసామిశర్మ, ఎమెస్కో,మద్రాస్,1968, పుట-198</ref>
 
"https://te.wikipedia.org/wiki/అమరచింత_సంస్థానం" నుండి వెలికితీశారు