లక్ష్మీదీపక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''లక్ష్మీదీపక్''' తెలుగు సినిమా దర్శకుడు. ఇతడు [[హైదరాబాద్]]లో [[1935]]లో జన్మించాడు. ఇతని అసలు పేరు లక్ష్మీనారాయణ. ఇతడి చదువు ఉర్దూ మాధ్యమంలో సాగింది. ఇతడు హైస్కూలు చదువుకొనే సమయంలోనే సినిమాల పట్ల ఆకర్షితుడై దర్శకుడు కావాలనే కోరికను పెంచుకున్నాడు. హిందీ సినిమారంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని 1958లో బొంబాయి వెళ్ళాడు. కానీ అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు. తిరిగి హైదరాబాదు వచ్చేశాడు. హైదరాబాదులో ఇతనికి [[అట్లూరి పూర్ణచంద్రరావు]], [[ప్రత్యగాత్మ]], [[గుత్తా రామినీడు]]లు పరిచయమయ్యారు. [[గుత్తా రామినీడు|రామినీడు]] ఇతనికి తొలిసారిగా [[చివరకు మిగిలేది]] సినిమాలో సహాయ దర్శకుడిగా పనిచేసేందుకు అవకాశం ఇచ్చాడు. తరువాత [[గుత్తా రామినీడు|రామినీడు]] , [[కొల్లి హేమాంబరధరరావు|హేమాంబరధరరావు]]ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీదీపక్" నుండి వెలికితీశారు