బంకుపల్లె మల్లయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==బాల్యం, విద్యాభ్యాసం==
ఇతడు తన ఐదవ యేట తన తండ్రివద్ద వేదాధ్యయనము ప్రారంభించాడు. తరువాత ఉర్లాం జమీందారు కందుకూరి బసవరాజు గారి ఆస్థాన పండితుడైన భళ్లమూడి లక్ష్మణశాస్త్రి వద్ద సంస్కృతము నేర్చుకున్నాడు. తన పదహారవ యేడు వచ్చేసమయానికి పంచకావ్యాలు పూర్తిగా చదివాడు. తరువాత [[పర్లాకిమిడి]] రాజా వారి సంస్కృత కళాశాలలో చేరి అక్కడ భళ్లమూడి వెంకటశాస్త్రివద్ద శృంగారనైషధము, అభిజ్ఞాన శాకుంతలము చదివాడు. తరువాత పరవస్తు రంగాచార్యుల వద్ద సిద్ధాంతకౌముది పూర్తిచేశాడు. కూరెళ్ల సూర్యనారాయణశాస్త్రి వద్ద తర్కశాస్త్రము చదువుకున్నాడు. పోకల సింహాచలం వద్ద సంగీతము నేర్చుకున్నాడు. బంకుపల్లి కామశాస్త్రి వద్ద మంత్రశాస్త్రాన్ని అభ్యసించాడు. భళ్లమూడి దక్షిణామూర్తి శాస్త్రివద్ద పంచదశ ప్రకరణములు, గీతాభాష్యము చదువుకున్నాడు. [[శ్రీకూర్మం]] సంస్కృత పాఠశాలా పండితుడైన నౌడూరి వెంకటశాస్త్రి వద్ద మనోరమ, శబ్దరత్నములు మరియు పారిభాషేందుశేఖరము చదివాడు. [[గిడుగు రామమూర్తి]] పంతులు వద్ద ఇంగ్లీషు చదివాడు. మంత్రశాస్త్రవిద్యలో తన సహాధ్యాయి అయిన గంటి సూర్యనారాయణశాస్త్రి వద్ద వేదాంత, మీమాంస శాస్త్రాలను నేర్చుకున్నాడు.
 
[[వర్గం:1876 జననాలు]]