శారద యస్. నటరాజన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
పదిహేనేళ్ళు తిరక్కుండా తండ్రి గతించాడు. తండ్రి దహనక్రియలు అయింతరువాత, యింటికి తిరిగి వస్తూ, మూర్ఛ వచ్చి రోడ్డుమీద పడిపోయేడుట. ఆ మూర్చవ్యాధితోనే 32వ ఏట 1955లో మరణించేడు.
 
==కథలపై ఆశక్తి==
 
నటరాజన్ కి చిన్నతనంనించీ కథలమీద ఆసక్తి. మద్రాసులో తండ్రి దినమణికదిర్ ఆఫీసులో సంపాదకుడుగా కొంతకాలం పనిచేయడం నటరాజన్కి పత్రికలూ, కథలమీద ఆసక్తి పెంచుకోడానికి దోహదం అయిందేమో. తెనాలి వచ్చిన తర్వాత ఒక వీధిబడి పంతులు దగ్గర పట్టుదలతో తెలుగు నేర్చుకుని కథలు రాయడం మొదలు పెట్టేడు. కాయితాలు కొనడానికి స్తోమతు లేక కలెక్టరాఫీసువారు పారేసిన చిత్తుకాయితాలు ఏరుకుని, రెండోవేపు రాసేవాడుట. హోటల్లో నిలకడలేని ఉద్యోగం చేస్తూనే.
 
1946లో అరసం నిర్వహించిన సాహిత్య పాఠశాల శారదకి తనదైన దృక్పథం, మార్గం ఏర్పరుచుకోడానికి దోహదం అయిందంటారు సురేష్. <ref>(శారద రచనలు, ముందుమాట.)</ref>
 
తెలుగు స్వతంత్రలో 1950-51 మధ్యలో క్షణంలో సగం అన్న ధారావాహిక శీర్షికలో రాజకీయ వ్యంగ్యరచనలు చేశాడు. రెండు నాటికలు, ఆరు నవలలు రాశాడు. చివరినవల చీకటితెరలు అసంపూర్ణం. ఇంకా కవితలు కూడా రాశాట్ట. నేను చూడలేదు.
"https://te.wikipedia.org/wiki/శారద_యస్._నటరాజన్" నుండి వెలికితీశారు