గుత్తికొండ నరహరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
1955 లో ఆంధ్ర ప్రభ ఎడిటర్ [[నార్ల వెంకటేశ్వరరావు]] కు ఎం.ఎన్.రాయ్ పూర్తి సాహిత్యం అందచేసి ఆయన నవ్య మానవ వాదిగా మారడానికి నరహరి కారకుడయ్యాడు. ఎం.ఎన్.రాయ్ 1955 లో మరణించినప్పుడు ఆయనపై సంపాదకీయం రాయక పోగా, వార్త కూడా ఆంధ్ర ప్రభలో వేయనందుకు ఆవుల గోపాల కృష్ణమూర్తి విరుచుకపడి నార్లను దుయ్యపట్టాడు. అప్పుడు నరహరిని కోరి, రాయ్ సాహిత్యం, నార్ల తెప్పించుకున్నాడు. నార్ల ఆలోచనా విధానం పై ఎం.ఎన్.రాయ్ రచనలు, సిద్ధాంతాలు ప్రభావితం చేశాయి.
==హేతువాది==
[[కొండవీటి వెంకటకవి]] తన నెహ్రు కావ్యం ద్వితీయ భాగాన్ని నరహరికి అంకితం ఇచ్చాడు. ఎన్.కె.అచార్య, [[ఆలపాటి రవీంద్రనాథ్]], [[ఎన్. ఇన్నయ్య]] లతో హేతువాద, మానవవాద విషయాలలో కలసి పనిచేశాడు. నరహరి రాష్ట్ర రాడికల్ డెమొక్రాటిక్ పార్టి కార్య దర్శిగా మానవ విలువలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి కృషి చేశాడు. మూఢనమ్మకాలు వున్న జనానికి చక్కగా శాస్తీయ విషయాలు విడమరచి చెప్పడంలో అందెవేసిన నరహరి,[[1985]] [[మార్చి 27]] న చనిపోయాడు.
[[వర్గం:1918 జననాలు]]
[[వర్గం:1985 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/గుత్తికొండ_నరహరి" నుండి వెలికితీశారు