పుష్కరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
==పుష్కరుని చరిత్ర==
పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో
ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా [[తందిలుడు]] పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. [[ఈశ్వరుడు]] అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు .ఆ కోరికను [[బ్రహ్మదేవుడు]] మన్నించాడు కానీ [[పుష్కరుడు]] తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు [[బృహస్పతి]], బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తున్నాయి.
 
==పుష్కర సమయంలో చేయవలసిన దానాలు==--
పురాణాలలో చెప్పబడిన పుష్కర సమయంలో చేయవలసిన [[దానాలు]].
*మొదటి రోజు;- సువర్ణ దానం, [[రజితము]] దానం, ధాన్య దానం , భూదానం చేయాలి.
*రెండవరోజు;-వస్త్ర దానం, లవణ దానం, రత్న దానం చేయాలి.
*మూడవ రోజు;- గుడ(బెల్లం), అశ్వశాఖ, ఫల దానం చేయాలి.
*నాల్గవ రోజు;-ఘృతం(నెయ్యి)దానం,తైలం(నూనె)దానం,క్షీరం(పాలు),మధువు(తేనె)దానం చేయాలి.
*ఐదవ రోజు;-ధాన్యదానం , శకట దానం,వృషభదానం, [[హలం]] దానం చేయాలి.
*ఆరవవ రోజు;-ఔషధదానం, కర్పూరదానం,చందనదానం, [[కస్తూరి]] దానం చేయాలి.
*ఏడవ రోజు;- గృహదానం, పీట దానం, శయ్య దానం చేయాలి.
*ఎనిమిద రోజు;- చందనం, కందమూలాల దానం, పుష్ప మాల దానం చేయాలి.
*తొమ్మిదవ రోజు;-పిండ దానం, దాసి దానం, కన్యాదానం, [[కంబళి]] దానం చేయాలి.
*పదవ రోజు;-శాకం(కూరగాయలు)దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం చేయాలి.
*పదకొడవ రోజు;-గజ దానం చేయాలి.
"https://te.wikipedia.org/wiki/పుష్కరం" నుండి వెలికితీశారు