"రసాయన శాస్త్రము" కూర్పుల మధ్య తేడాలు

(IN CHEMISTRY HAVE MANY PARTS)
=nirodalu= పరిచయము ==
 
రసాయనశాస్త్రం (in [[Greek language|Greek]]: ''χημεία'') చాల విస్తృతం. ఇటువంటి విస్తృతమయిన శాస్త్రాన్ని ఏకాండీగా అధ్యయనం చెయ్యటం కష్టం. అందుకని చిన్న చిన్న ఖండాలుగా విడగొట్టి పరిశీలిస్తాం. అటువంటప్పుడు కొన్ని కొన్ని అంశాలు అనేక ఖండాలలో పదే పదే పునరావృతం కాక తప్పదు.
మౌలికంగా చెప్పుకోవాలంటే, రసాయనశాస్త్రంలో పదార్థ లక్షణాలని (material properties) అధ్యయనం చేస్తాం. ఒక పదార్థం (matter) మరొక పదార్థంతో సంయోగం చెందినప్పుడు ఏమవుతుంది? ఒక పదార్థం శక్తి (energy)తో కలసినప్పుడు ఏమవుతుంది? ఒక పదార్థం మరొక పదార్థంగా ఏయే సందర్భాలలో మారుతుంది? ఇటువంటి ప్రశ్నలకి సమాధానాలు రసాయనశాస్త్రంలో దొరుకుతాయి. ఒక పదార్థం మరొక పదార్థంతో కలసినప్పుడు జరిగే పనినే [[రసాయన ప్రక్రియ]] (chemical reaction) అంటారు. ఈ ప్రక్రియలో పదార్థంలో ఉన్న కొన్ని [[రసాయన బంధాలు]] (chemical bonds) సడలి కొత్త కొత్త బంధాలు ఏర్పడతాయి.
 
పదార్థం, (ఉదాహరణకి: మనం కూర్చునే కుర్చీ, పీల్చే గాలి) [[బణువుఅణువు]] (molecule)ల సముదాయం. ప్రతి బణువుఅణువు లోను కొన్ని [[అణువుపరమాణువు]](atom)లు ఉంటాయి. అణువుపరమాణువు అంతర్భాగంలో పరమాణువుఎలక్ట్రాన్,ఫోటాన్ మరియు న్యూట్రాన్ వంటి ఉపపరమాణు భాగాలు (sub-atomic particles)లు ఉంటాయి. అయినప్పటికీ, మన దైనందిన జీవితంలో మనకి తారసపడేవి, మన అనుభవ పరిధిలో ఇమిడేవి బణువులుఅణువులు, వాటి రసాయన లక్షణాలు. కాని ఈ రసాయన లక్షణాలని నిర్ణయించేది అణువులు, వాటి మధ్య ఉండే రసాయన బంధాలు. ఉదాహరణకి, [[ఉక్కు]] ధృఢంగా ఉందంటే దానికి కారణం ఉక్కు బణువులో ఉన్న అణువుల అమరిక, వాటి మధ్య ఉన్న రసాయన బంధాల శక్తి. కర్ర మండుతున్నాదంటే కర్రలో ఉన్న [[కర్బనం]] (carbon) గాలిలో ఉన్న [[ఆమ్లజని]] (oxygen)తో రసాయన సంయోగం చెందింది కనుక. [[గది ఉష్ణోగ్రత]] (room temperature) వద్ద నీరు ద్రవ రూపంలో ఉందంటే దానికి కారణం నీటి బణువులలో ఉన్న అణువులు వాటి ఇరుగు పొరుగు అణువులతో ప్రవర్తించే విధానం అనుకూలించింది కనుక. ఆ మాటకొస్తే ఈ వాక్యాలు మీరు చదవగలుగుతున్నారంటే దానికి కారణం ఈ వాక్యాల మీద పడ్డ కాంతి పుంజం పరావర్తనం చెంది, మీ కంట్లో ప్రవేశించి, కంటి వెనుక రెటీనా మీద ఉన్న [[ప్రాణ్యము]] (protein) బణువుల తో రసాయన సంయోగము చెందటమే. ఆఖరు మాటగా, ఈ వాక్యాలు చదువుతూన్న చదువరులకి ఇదంతా అర్ధం అవుతోందంటే దానికి కారణం కూడ వారి వారి మెదడులలో జరిగే రసాయన ప్రక్రియలే.
 
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1756340" నుండి వెలికితీశారు