3,113
edits
(విశదీకరించాను) |
|||
{{main|ఏనుగుల వీరాస్వామయ్య}}
శ్రీ ఏనుగుల వీరాస్వామి అనే మహాపురుషుడు మద్రాసు నుండి కాశీకి రెండుసార్లు కాలి మార్గంలో ప్రయాణం చేశాడు. ఆ వివరాలు ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర అనే గ్రంథంగా తర్వాతి కాలంలో అంటే 1838 లో కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్లై అనే విద్వాంసుడు అచ్చు వేయించాడు. శ్రీ వీరాస్వామి మద్రాసు సుప్రీం కోర్టు శాఖలో ఇంటర్‌ప్రిటర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఆయనకు ధర్మబుద్ధి, పలుకుబడి ఎక్కువే. సకుటుంబ సపరివారంగా డేరాలతో సహా ఆయన చేసిన ప్రయాణాలలో మనకు అద్భుతం కల్గించే అంశాలు ఎన్నో ఉన్నాయి.
1941 లో [[దిగవల్లి వేంకట శివరావు]] ఈ గ్రంథాన్ని సంస్కరించి ఎన్నో క్లిష్టతరమైన ఆలనాటి తెలుగు-ఉరుదూ-తమిళం కలిసియున్న మాటలకు అర్ధములతో సరళమైన తెలుగు భాషలో వెలువరించి 3 వ సంకలనము ప్రచురించారు. వీరస్వామి వ్రాసింది తెలుగు భాషలోనే. ఐతే అది రెండు వందల సంవత్సరాల నాటి జనవ్యవహార భాష కావటంతో మూడవసంకలనములో చేసిన సంస్కరణలుకు భాషా శాస్త్రపరంగా కూడా ఎంతో ప్రాధాన్యం లభించి, గిడుగు రామమూర్తి పంతులుగారి మన్ననలకు పాత్రమయింది. వెళ్ళేటప్పుడు మద్రాసు, హైదరాబాద్, నాగపూర్, అలహాబాదుల మీదుగా వీరాస్వామిగారు కాశీ చేరారు. వచ్చేటప్పుడు గయ, ఛత్రపురం, భువనేశ్వర్, విశాఖపట్నం, ఒంగోలు, కావలి, నెల్లూరు మీదుగా సాగరతీరం వెంట మద్రాసు చేరారు. మొదటి రెండు సంకలనములలో క్లితరమైన భాసాశైలే కాక పేరాలుగానీ, విశేషమువారి విభజనగానీ లేవు.
==కాశీయాత్ర చరిత్ర రచన ప్రాముఖ్యత==
*ఈ గ్రంథం [[1869]] లో ద్వితీయ ముద్రణ పొందింది.
*ఈ గ్రంథం [[1941]] లో [[దిగవల్లి వేంకట శివరావు]] అనేక వివరణలతో మూడవ సంకలనం ప్రచురించారు ఆంద్రగ్రంధాలయ ముద్రాక్షరశాలలో ముద్రించారు. ఈ మూడవ సంకలనం రెండవ ముద్రణ తిరిగి 1991లో ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు క్రొత్త ఢిల్లీ లో ముద్రించారు.
=='''ఈ పుస్తకము యొక్క ఇంగ్లీషు తర్జుమా'''==
1975 లో ఏ.ఫి ఆర్కైవ్సు వారు ఏనుగుల వీరస్వామయ్యగారి కాశీయాత్రచరిత్ర ఇంగ్లీషులో ప్రచురణచేశారు
==మూలాలు, వనరులు==
|
edits