దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
{{దస్త్రం:పెద్దాపుర సంస్థాన చరిత్రము - వత్సవాయ రాయజగపతి వర్మ విరచితము|వంగలపూడి శివకృష్ణ చే ఇప్పటి వాడుక బాషలోకి అనువదించబడినది}}
 
పెద్దాపురం[[పెద్దాపుర సంస్ధానంసంస్థాన చరిత్రచరిత్రము]] : [[వంగలపూడి శివకృష్ణ]] - 1
వత్సవాయి రాయ జగపతి వర్మ గారు - పెద్దాపురం మహా సంస్థాన చరిత్ర మరుగున పడిపోవడం సహించలేక దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి ఎందరో పండితులు, మేధావులు, బహు బాషా కోవిదులు మరియు మరెందరో చరిత్రకారులు సహకారంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో కష్టపడి రచించిన ------ పెద్దాపుర సంస్థాన చరిత్రము --- ను ఇప్పటి వాడుక బాషలో అనువదించడానికి ప్రయత్నిస్తున్నాను దయచేసి సహకరించవలసినదిగా కోరి ప్రార్ధిస్తున్నాను ... ఇట్లు మీ వంగలపూడి శివకృష్ణ
 
పెద్దాపురం[[పెద్దాపుర సంస్ధానంసంస్థాన చరిత్రచరిత్రము]] : [[వంగలపూడి శివకృష్ణ]] - 2
ఆంధ్ర గీర్వాణ బాషా కోవిదుడు
బహు శాస్త్ర విశారదుడు
పంక్తి 17:
 
 
�పెద్దాపురం�[[పెద్దాపుర సంస్ధానంసంస్థాన చరిత్రచరిత్రము]] : [[వంగలపూడి శివకృష్ణ]] – 3�
పీఠిక
--:0:--
పంక్తి 27:
 
పూర్వం పెద్దాపురం సంస్థానం ఆంధ్ర దేశం లో ఒక బాగం గా వుండేది. దానిని సుమారు 300 సంవత్సరముల వరకూ శ్రీ వత్సవాయ వంశస్తులైన క్షత్రియులు పాలించారు. ఆ తరువాత సంస్థానంలోకి చిన్న చిన్న జమిందారులు, ముఠా లు మాత్రమే ఒకప్పుడు పెద్దాపురం అన్నంతగా మారిపోయింది. ఆ తరువాత పెద్దాపురం ఒక తాలుకా గ్రామంగా ఉండి బ్రిటీషు వారి అనేక కార్యాలయములతో నిండి పోయింది....పూర్వం ఈ పెద్దాపురం - పిఠాపురం ప్రాంతాలు " పొర్లు నాడు " అని పిలవ బడేవి - పెద్దాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు నది ప్రవహించడం వాళ్ళ దీనికి ఆ పేరు వచ్చిందని అనేవారు. 'ఈ ఏలేరు ఆధారము వలననే పల్లపు భూములలోని చాలా బాగం సాగు చేయబడుచున్నది. ఇక్కడ మెట్ట పంట విరివిగా పండును. గోదావరి జిల్లాలన్నిటిలో ఇతర తాలుకా గ్రామాలన్నిటినీ పోల్చి చూస్తే ఇక్కడ జన సంఖ్య తక్కువగా ఉన్నది. ఇక్కడ చదరపు మైలుకి (కిలోమీటరున్నర) కి సుమారు 331 మంది మాత్రమే కలరు. పల్లపు తాలూకాల కంటే విద్యా విషయం లో వెనుకబడి వుంది. పురుషులలో నూటికి 5 శాతం ప్రజలు మాత్రమే చదవడం, వ్రాయడం నేర్చుకొన్నారు. ఉ త్తర సర్కార్లు అని పిలువబడే ఆంధ్రదేశ బాగంలోని ఈ పెద్దాపురం సంస్థానమును పరిపాలించిన శ్రీ వత్సవాయ రాజ వంశీయులు సూర్యాన్వయ సంభవులనీ వీరికి మూల పురుషుడు సాగిపోతరాజు అని ఏనుగు లక్ష్మణ కవి వారు తన రామ విలాసం అనే గ్రంధములో
 
{{పెద్దాపురం సంస్థానాదీసుల నిర్మాణం}} : [[ఆత్రేయపురం]] అగ్రహారం
********************************************
ఆత్రేయపురం గ్రామం : ఈ పేరు వింటే ప్రపంచ వ్యాప్తంగా వున్నా తెలుగు వారికి గుర్తొచ్చేది ఏంటి ?
పూత రేకులు... పూత రేకులు... పూతరేకులు....
మరి ఆత్రేయ పురం గ్రామం ఎలా ఏర్పడిందో మనలో ఎంతమదికి తెలుసు ... అక్కడి అగ్రహార నిర్మాణం దాని పూర్వ చరిత్ర వైభవం.
 
గోదావరి - కొండలు, కోనల మీదుగా ప్రవహిస్తూ, గరువాల నడలతో పరవళ్లు తొక్కుతూ, శంఖాలు పూరించి కిన్నరులు మీటుతూ, ఎందరెందరో వీరవరుల విజయగాధలకూ, కవి వర్యుల మధుర భావనలకూ, గాయకుల గంధర్వ గానాలకూ శిల్పిశ్రేష్టుల అపూర్వ సృష్టికి, శాస్త్రజ్ఞుల విజ్ఞాన వైభవానికి ఆలవాలంగా అలరారుతోంది.
ఆంధ్రదేశంలో ఈ గోదావరి తెలంగాణాలో ప్రారంభించిన తన యాత్ర తూర్పు సాగరాభిముఖంగా సాగిస్తూ, సప్త శాఖలుగా సాగర సంగమం చేస్తూంది. గోదావరి పొడుగునా వేదవిదులు, ఆర్ష నాగరికతా ధౌరేయులు అయిన ఎందరో విప్రవంశాల వారు నివసిస్తూ, వేద విద్యకు అధీతి, బోధ, ఆచరణ ప్రచారణలతో చతుర్ముఖుని నాలుగు ముఖాల్లా విలసిల్లజేస్తున్నారు. విదేశీ దండయాత్రలూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా వీరు తమ ప్రశాంత నివాసాలను వీడి వలస పోవలసి వస్తున్నా, వారు గోదావరి మాత ఒడిని మాత్రం వీడలేదు. ఆ నదీమతల్లి ననుసరించి పయనిస్తూ, గోదావరీ సాగర సంగమ ప్రాంతాన్ని చేరుకొన్నారు. కొన్ని విప్రవంశాల వారు పావన గౌతమీ తీరాన నివసిస్తూ, వేదమాతనుపాసిస్తూన్న విప్రులలో జటావల్లభుల వారు, కాశీచయనుల వారు కొందరు సంప్రదాయ బద్ధంగా సంవత్సరాల పాటు నియమనిష్ఠలతో అభ్యసించిన వేద విద్యను శిష్యులకు ఆదరంగా నేర్పారు వారు.
 
ఆ వేద ప్రతిపాదితాలైన యజ్ఞ యాగాది కర్మలను తాము ఆచరిస్తూ, తోటి వారిని ఆచరింప చేయడానికి వారు కృషి చేసారు. ఋత్విక్కు అధ్వర్యుడు, ఉద్గాత, ఉపద్రష్ట, అను నలుగురు యజ్ఞ విధులను నిర్వర్తించేవారు. యజ్ఞం చేసి సోమయాజి కావడం నాటి విప్రుల జీవిత పరమావధి.
వీరిలో జటావల్లభుల వారు మొదట్లో తెలంగాణాలోని వెదురుచర్ల అనే గ్రామంలో నివసిస్తూ ఆ గ్రామ నామమే ఇంటిపేరుగా ధరిస్తూ వుండేవారు. వేదమాతకు వారు కూరిమి బిడ్డలు, జటా, ఘన అనేవి వేదంలో క్లిష్టమైన అంశాలు వాటిని నిర్దుష్టంగా పఠించి పండిత పరిషత్తులో జటావల్లభ అనే బిరుదు నామాన్ని పొందారు ఆ వంశంలోని ఓ ధన్యజీవి. నాడు దేశాన్ని పాలిస్తున్నది తురుష్కులైనా, వారిలో కొందరు వేదవిద్య పట్ల గౌరవాభిమానాలు కలిగి వుండేవారు. అటువంటి నవాబు ఒకరు వీరికి ఈనాములు ఇచ్చి గౌరవించారు.
కాలక్రమాన వచ్చిన యుద్ధాల వలన ప్రజా జీవితం కలత చెంది అనుష్టానాలకు భంగం వాటిల్లుతూ వుండటం వలన వారు ఆ ఊరు విడిచి పెట్టవలసి వచ్చింది. ఉన్న ఊరు కన్నతల్లి అన్నారు కదా ! ఉన్న ఊరు విడిచినా గోదావరి తీరవాసాన్ని మాత్రం వీడలేని వారు ఆ నది వెంబడే సుదీర్ఘ పయనాలు సాగిస్తూ వచ్చి పెద్దాపురం సంస్థానం చేరారు.
ఆ రోజుల్లో పెద్దాపురం సంస్థానం మంచి ఆదాయం కలిగివుండి ధర్మపరుడు, శాంతి భద్రతలు పరిరక్షించగల సమర్థుడు అయిన ప్రభువు పాలన ఉండేది. ఈ వేద పండితుల్ని సగౌరవంగా ఆదరించి, కొన్ని ఈనాములు ఇచ్చి తమ కొలువులో నెలకొల్పుకొన్నారు ఆ ప్రభువులు. ఒక పర్యాయం పెద్దాపురం ప్రభువులకు స్వప్నంలో సాక్షాత్కరించి తాను గౌతమీ తీరాన వెలుస్తున్నానని తనకు గుడి గోపురాలు నిర్మించి, పూజా పురస్కారాలకు ఏర్పాట్లు చేయమని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశించాడు. గోదావరి డెల్టాలో వాడపల్లి అనే గ్రామం వద్ద గోదావరిలో బెస్తవారికి వేంకటేశ్వర స్వామి విగ్రహం లభించింది. దాన్ని వారు ఒక పాకలో వుంచి వారికి తోచిన విధంగా పూజాదికాలు నిర్వహిస్తున్నారు. రాజ పురుషులు అక్కడికి వచ్చి స్వయంగా చూసి ఆ విషయాన్ని ప్రభువులకు నివేదించారు. మహారాజు అశ్వారూఢుడై బయలుదేరి వచ్చాడు. ఆలయ నిర్మాణానికి తగు ఏర్పాట్లు చేసారు. ఆలయంతో పాటు స్వామి సేవకు అర్చకులూ, మహా ప్రసాదం తయారు చేయడానికి వంటవారు, స్వామి సేవకులు, వాద్యకారులైన మంగలులు, నృత్య గీతాదికైంకర్యానికి దేవదాసీలు వచ్చి చేరారు. ఆలయ ధర్మకర్తలుగా తమ సంస్థానంలో వున్న వేద పండితులైన జటావల్లభుల వారి వంశంలో ఒక శాఖను వాడపల్లి పంపారు పెద్దాపురం సంస్థానాధీశులు. వీరితో పాటు మరికొన్ని బ్రహ్మణ వంశాల వారు గౌతమీ తీర వాసాన్ని కోరి వచ్చారు. వారందరికీ ప్రభువు వాడపల్లి గ్రామానికి 2 మైళ్ళ దూరంలో నివేశన స్థలాలు, జీవికకై పంట పొలాలు ఇచ్చి ఆత్రేయపురం అగ్రహారాన్ని ఏర్పరచారు. అష్టాదశ వర్ణాల వారు వచ్చి అగ్రహారానికి అనతి దూరంలో నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఆత్రేయపురం గ్రామం ఆ విధంగా ఏర్పడింది .