సైకిల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==డన్‌లప్ టైర్లు అభివృద్ధి==
టైర్లను కనుగొన్న కీర్తి బెల్ ఫాస్ట్ లో స్థిరపడ్డ [[స్కాట్లండ్]] పశువైద్యుడు జాన్ బాయిడ్ డన్‌లప్ యొక్క పదేళ్ళ కుమారునికి దక్కింది. మూడు చక్రాల సైకిలు పందెంలో తనని ఎలాగైనా గెలిచేలా చేయాలని కొడుకు తండ్రి వద్ద మారాం చేశాడు. అప్పట్లో సైకిలు చక్రాలకు దళసరి రబ్బరు టైర్లను ఉపయోగించేవారు. వీటివల్ల కుదుపులు తగ్గడమంటూ జరగలేదు. చెట్లకు నీళ్ళు పట్టడానికి ఉపయోగించే హోసు గొట్టాన్ని(Hose pipe) డాక్టర్ డన్లప్ రెండు భాగాలుగా చేసి, వాటిని వెనక వుండే రెండు చక్రాలకు అతికించి, పంపు సహాయంతో గొట్టాల్లో గాలి నింపాడు. అబ్బాయి పందెంలో గెలవటమే కాకుండా, అదే సైకిలుతోనే హాయిగా ఊరంతా తిరుగుతూ ఉండిపోయాడు. ఈ సంఘటన జరిగిన ఒక సంవత్సరం లోపుగానే దీన్ని గురించి వార్తా పత్రికల్లో వ్రాయటం, ఒక ఐర్లండ్ పారిశ్రామికునితో కలిసి జాన్ డన్‌లప్ గాలి టైర్లను తయారు చేయటం జరిగింది.
 
==సామాన్య ప్రజల వినియోగం==
"https://te.wikipedia.org/wiki/సైకిల్" నుండి వెలికితీశారు