ఉప్పెన: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎సునామీ: లంకె తగిలించేను
పంక్తి 33:
“అసలు టైడల్ వేవ్ (tidal wave) అన్న మాటే తప్పుడు ప్రయోగం, అది వాడకూడదు, సునామీ అన్నదే సరి అయిన ప్రయోగం” అని అమెరికాలో కొందరు వాదించటం మొదలుపెట్టేరు. “ఉప్పెన అన్నా, సునామీ అన్నా టైడల్ వేవ్ కి పర్యాయ పదాలు" అనుకునేవారు, సామాన్యులు. కాని “దివిసీమలో ఉప్పెన," "బందరు ఉప్పెన" అన్న ప్రయోగాలు వార్తాపత్రికలలో చూసిన తరువాత, నిలకడ మీద ఆలోచించి చూడగా బందరులోనూ దివిసీమలోనూ వచ్చినది ఉప్పెన అనే తీర్మానించుకున్నవారు ఉన్నారు - అనగా సునామీ కాదని తాత్పర్యం. ఉప్పెన అంటే సముద్రం పోటు పెడుతూన్న (high tide) సమయంలోనే తుపాను కారణంగా వచ్చిన ముంపు అని నిర్వచనం చెయ్యవచ్చు. బందరు, దివిసీమ - ఈ రెండూ - సముద్రమట్టంలో ఉన్న ప్రాంతాలు కాబట్టి సముద్రపు నీరు లోపలికి చొచ్చుకు రావడానికి అవకాశం ఎక్కువ. ఈ రకం ముంపుని ఇంగ్లీషులో "టైడల్ వేవ్" అంటారు. ఎందుకుట? సముద్రపు పోటు (tides), తుపానువల్ల వచ్చే కెరటాలు (waves) కలిసిపోయాయి కనుక! ఇలా ఆలోచిస్తే టైడల్ వేవ్ అన్న ఇంగ్లీషు మాటకి ఉప్పెన సమానార్థకమైన తెలుగు మాట. అనగా, సముద్రానికి పోటు వచ్చే తరుణంలోనే తుపాను కూడా వస్తే ఆ రెండింటి ప్రభావం వల్ల పల్లపు ప్రాంతాలు ములిగిపోతే దానిని ఉప్పెన అంటారు.
==సునామీ==
మిగిలినది [[సునామీ]]. సముద్ర గర్భంలో, ఎక్కడో, భూమి కంపించడం వల్ల సముద్రం అడుగున ఉన్న భూమి కుంగి, కూలిపోయిన సందర్భంలో, పరిస్థితులు అనుకూలిస్తే ఒక మహత్తర కెరటం పుట్టుకొచ్చి అది మహా వేగంతో ఒడ్డుని ఢీకొంటుంది. అదీ సునామీ అంటే! సునామీ ఒక ఊరికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు; సునామీ వల్ల భౌగోళికంగా చాల ప్రాంతాలు దెబ్బ తింటాయి. సముద్రపు ఆటుపోట్లకీ సునామీకి సంబంధం లేదు. వాతావరణంలో వచ్చే అల్పపీడనానికీ సునామీకి సంబంధం లేదు.
 
===కాసింత భౌతిక శాస్త్రం===
"https://te.wikipedia.org/wiki/ఉప్పెన" నుండి వెలికితీశారు