"సాక్షి (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

 
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
19రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభించారు. దానిలో భాగంగా ఎడిటింగ్, అప్పటికి ట్రయల్ కోసం డబ్బింగ్ చేసిన సీన్లు కాక మిగతా వాటికి డబ్బింగ్ పూర్తచేసుకున్నారు. రీరికార్డింగ్ సంగీత దర్శకుడు [[కె.వి.మహదేవన్]] చేశారు. చివర్లో చేసే టైటిల్ మ్యూజిక్ కోసం విభిన్నమైన ప్రయత్నం చేశారు. అంతకుముందు ఓసారి బాపురమణల ముందు విజయవాడలో[[విజయవాడ]]లో మారుతీ టాకీసు అధినేత బెనర్జీ పల్లెటూరి డప్పుల మేళంతో కచేరీ ఏర్పాటుచేశారు. వాటిలో డప్పులూ, కంచాలు-పలుదోము పుల్లలతో వాయిస్తూంటారు. విజయవాడలో ఈ మేళాన్ని విన్న బాపుకు టైటిల్ మ్యూజిక్ సమయంలో గుర్తుకువచ్చి, "మనది పల్లెటూరి కథే కాబట్టి ఈ డప్పులూ, కంచాల మేళమే టైటిల్ మ్యూజిక్" అని నిర్ణయించారు. బెనర్జీ, నిర్మాత డూండీ సహకారంతో ఆ మేళం చేసిన పన్నెండుమంది కళాకారుల్నీ [[మద్రాసు]] తీసుకువచ్చి డప్పులూ కంచాలతోనే మూడు గతులతో తాళాలతో స్వరపరిచి రికార్డు చేసి దాన్నే ఉపయోగించారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి" />
 
== బడ్జెట్ ==
1,85,173

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1760447" నుండి వెలికితీశారు