సుమతీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
 
తరతరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకూ, పంతుళ్ళు తమ శిష్యులకూ సుమతీ శతకంలోని నీతులను ఉపదేశిస్తున్నారు. 700 సంవత్సరాల తరువాత కూడా ఇందులోని సూక్తులు నిత్య జీవనానికి సంపూర్ణంగా వర్తిస్తాయి. చెప్పదలచిన విషయాన్ని సూటిగా, కొద్ది పదాలలో చెప్పిన విధానం అత్యద్భుతం. మొదటి పద్యంలోనే కవి "ధారాళమైన నీతులు నోరూరగ జవులుపుట్ట, ఔరా యనగా, నుడివెద"నని చెప్పుకున్నాడు. ఇందుకు పూర్తి న్యాయం చేయగలిగాడు.
 
== అప్పటి జీవనశైలికి దర్పణం ==
 
ఇందులో పద్యాలు అందరి నోటా నానడం వలన ఈ శతకం వ్రాతపతులు పరిరక్షింపబడలేదు. కనుక మధ్యమధ్యలో ఇతరులు జొప్పించిన పద్యాలు, పదాలు కలిసిపోయాయి. ("చీటికి ప్రాణము వ్రాలు" అనేది "కుంఫిణీ యుగం" కాలంలో పుట్టిన పద్యం / పదం కావచ్చును. "వైదీకి", "రొక్కము" అనే పదాలు అంత ప్రాతకాలం వాడుకలు కాకపోవచ్చును). అయినా ఎక్కువ పద్యాలకు పెద్దగా పాఠాంతరాలు లేవు. కనుక పద్యాలను స్థూలంగా పరిశీలిస్తే ఆనాటి జీవన గతి, సమాజ స్థితి మనకు గోచరిస్తుంది.
 
దేశం (తెలుగునాడు) చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉంది. రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. సమాజంలోని ఇబ్బందులనూ, పేదరికాన్నీ ఆసరాగా చూచుకొని కొందరు మిగిలినవారిని పీడించేవారు. సామాన్య స్త్రీలలో [[విద్య]] అతి స్వల్పం. [[పడుపు వృత్తి]] విస్తృతంగా ఉంది. [[సాని]] వారి వెంటబడి తమ సంసారాలను గుల్ల చేసుకొనేవారు పుష్కలంగా ఉన్నారు.[[ వివాహేతర సంబంధాలు]] , వివాహానికి ముందు సంబంధాలు ఉండకపోలేదు. రాజుగారి బంటులు, [[కరణాలు]] దండిగా అధికారాన్ని చలాయించేవారు. డబ్బుకు అప్పుడూ పెద్ద పీటే. ఉద్యోగులకు లంచాలిస్తే పని జరిగేది. ప్రజలు అప్పులు, వడ్డీల ఊబిలో కూరుకుపోవడం జరుగుతుండేది. అల్లుళ్ళు అత్తమామల ఆస్తులను పిండేయడం అప్పుడూ జరిగేది.
 
 
కాని ఎక్కువ మంది సామాన్య జనులు సత్ప్రవర్తనకు, సత్యానికి, ధర్మానికి విలువనిచ్చేవారు. ఇల్లాలిని సంతోషింప జేయడం గృహస్తుని కర్తవ్యం. మాట, మర్యాద నిత్య వ్యవహారంలో చాలా ముఖ్యం. బాల్య వివాహాలు అప్పటికి లేనట్లనిపిస్తాయి (ఇది తరువాత ప్రబలిన [[దురాచారం]] కావచ్చును). రాజులు, మంత్రులు, గ్రామాధికారులు న్యాయానికి, చట్టానికి బాగా ప్రాముఖ్యతనిచ్చారు. కనుక సమాజం అల్లకల్లోలంగా లేదు. అంత పేదరికం ఉన్నట్లనిపించదు. సంపన్నుల ప్రస్తావన తరచు వస్తుంది. ఏనుగులు, గుర్రాలు, ఇతర జంతువులు వూళ్ళలో తరచు కనిపించే జంతువులు.
 
 
జనంలో '[[రసికత]] 'కు మంచి ప్రాముఖ్యత ఉంది. బహువిధాలైన శృంగారాల ప్రస్తావన ఉంది. (అన్నీ పిల్లలకు సంబంధించిన [[నీతులు]] కాదు. "[[పెద్దలకు మాత్రమే]] " అనదగిన పద్యాలు చాలా ఉన్నాయి)
 
== కొన్ని అధిక్షేపింపదగిన విషయాలు ==
"https://te.wikipedia.org/wiki/సుమతీ_శతకము" నుండి వెలికితీశారు