"వి.కె.ఆదినారాయణ రెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

'''వి.కె.ఆదినారాయణ రెడ్డి''' ( వలిపిరెడ్డి గారి కొండారెడ్డి గారి ఆదినారాయణరెడ్డి) అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్యసమరయోధుడు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[అనంతపురం జిల్లా]], [[పెద్దపప్పూరు]] మండలం, [[చీమలవాగుపల్లి]]లో [[1917]], [[అక్టోబర్ 8]]వ తేదీన వి.కె.రంగప్ప, వి.కె.రంగమ్మ దంపతులకు జన్మించాడు. చీమలవాగుపల్లిలో ప్రాథమిక విద్య పూర్తి అయిన తర్వాత ఇతడూ [[తాడిపత్రి]] హైస్కూలులో సెకండ్ ఫారమ్‌ వరకు చదివాడు. తరువాత [[గుత్తి]]లోని లండన్ మిషన్ హైస్కూలులో ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివాడు. వల్లూరు రామారావు అనే ఆయన ప్రేరేపణతో స్వాతంత్ర్యం కోసం పోరాడే కాంగ్రెస్ రాజకీయాలవైపు ఆకర్షితుడైనాడు. 1937లో జరిగిన మద్రాసు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున గ్రామాలు తిరిగి ప్రచారం చేశాడు. తమ సామాజిక వర్గం నుండి, బంధువుల నుండి [[జస్టిస్ పార్టీ]]ని బలపరచాలని వత్తిడి వచ్చినా స్వతంత్రం కోసం పోరాడే కాంగ్రెస్ కే ప్రచారం చేశాడు. 1937లో [[గుంటూరు]] జరిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య మహాసభల పిలుపు మేరకు గుత్తి హైస్కూలులో డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా సమ్మె చేయించాడు. ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలు ముగిసిన తర్వాత సెలవులలో అమ్మ, మాలపల్లి మొదలైన నవలలు చదివి మానవతావాదల వైపు, అతివాద భావాలవైపు ఆకర్షితుడైనాడు.
ఇతడు [[అనంతపురం జిల్లా]], [[తాడిపత్రి]] తాలూకా [[చీమలవాగుపల్లె]]లో [[1917]], [[అక్టోబర్ 8]]వ తేదీన వి.కె.రంగప్ప, వి.కె.రంగమ్మ దంపతులకు జన్మించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1761376" నుండి వెలికితీశారు