ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
==జాతీయోద్యమంలో పాత్ర==
స్వాతంత్ర్యోద్యమంలో ఈ కళాశాల ముఖ్యపాత్రను నిర్వహించింది<ref>{{cite journal|last1=ఎడిటర్|title=స్వాతంత్ర్యోద్యమంలో అనంత విద్యార్థుల పాత్ర|journal=అనంతనేత్రం (వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక అనుబంధం)|date=1999|page=60}}</ref>. ఈ కళాశాల 1940-43 మధ్యకాలంలో రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది. ఈ కళాశాల విద్యార్థులు పలువురు తమ భవిష్యత్తును లెక్కచేయకుండా జాతీయోద్యమంలో దూకారు. స్థానిక పీస్ మెమోరియల్ హాల్‌లో ఎ.పి.సి.సి సమావేశం జరిగినప్పుడు [[నీలం సంజీవరెడ్డి]], [[కల్లూరు సుబ్బరావు]], [[పప్పూరు రామాచార్యులు]], [[కడప కోటిరెడ్డి]], [[టంగుటూరి ప్రకాశం]] మొదలైన హేమాహేమీలతో పాటు ఈ కళాశాల విద్యార్థులు జీవరత్నమ్మ, ఆదిశేషయ్య పాల్గొనడం ఆ రోజులలో సంచలనాన్ని సృష్టించింది. ఆ సమావేశంలో వ్యక్తిగత సత్యాగ్రహానికి బదులు సామూహిక సత్యాగ్రహం చేపట్టాలని నిర్ణయించారు. 1940 జనవరి 28 న కళాశాల విద్యార్థులు రమేష్, టి.కె.ఆర్.శర్మ, [[ఆదిశేషయ్య]], [[జీవరత్నమ్మ]]ల ఆధ్వర్యంలో పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ఆ కాలంలోనే [[ఐదుకల్లు సదాశివన్]], [[విద్వాన్ విశ్వం]], [[నీలం సంజీవరెడ్డి]]ల ఆధ్వర్యంలో [[ఆకాశవాణి]] అనే సైక్లోస్టయిల్ పత్రిక రహస్యంగా వెలువడేది. ఆ పత్రిక విద్యార్థులకు ఎంతో చైత్యన్యాన్ని పెంచింది. రాజకీయ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నందుకు [[ఆదిశేషయ్య]]ను కళాశాల నుండి బహిష్కరించారు. మహిళా విద్యార్థి జీవరత్నమ్మ ఆ రోజుల్లో విద్యార్థుల సమ్మెకు నాయకత్వం వహించింది. పోలీసులు ఆమెను చితకబాదారు. ఆ తర్వాత ఆమె రహస్యంగా జాతీయోద్యమం లో పాల్గొనింది. ఆ రోజుల్లో ఆమెను కాలేజీ జోన్ ఆఫ్ ఆర్క్ అని పిలిచేవారు. అప్పట్లో కాలేజీ లెక్చరర్లుగా ఉన్న [[దామెర్ల రామారావు]], [[ఉపమాక సూర్యనారాయణ]] రహస్యంగా విద్యార్థులకు మార్గదర్శనం చేసేవారు. ఈ విధంగా ఈ కళాశాల జాతీయోద్యమానికి సాక్షీభూతంగా నిలిచింది.
 
==తొలి విద్యార్థిని==