"సూర్యకాంతం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| caption = ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త
| birth_name = సూర్యకాంతం
| birth_date = [[28 అక్టోబర్ 28]], [[1924]]
| birth_place = [[వెంకట కృష్ణరాయపురం]]
| native_place = [[వెంకట కృష్ణరాయపురం]]
| death_date = [[17 డిసెంబర్ 17]], [[1996]]
| death_place = [[హైదరాబాద్]]
| death_cause = సహజ మరణం
| weight =
}}
'''సూర్యకాంతం''' ([[అక్టోబర్ 28]], [[1924]] - [[డిసెంబర్ 17]], [[1996]]) (Suryakantham), ఈ పేరు వింటేనే ఆంధ్రా కోడళ్ళకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఈ నాటికీ సాహసించరు. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయ్యాళి అయితే ‘అమ్మో - ఆవిడా? సూర్యకాంతమే!’ అని అందరూ భయపడి చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించింది ''సహజనట కళా శిరోమణి'' సూర్యకాంతం. విశేషం ఏమిటంటే, అత్తగారి పాత్రలో ఆమెకనిపించినా, అమెగయ్యాళే అని తెలిసినా - ఎన్ని సినిమాల్లో చూసినా ఏ మాత్రం విసుగు అనిపించకపోవడమే! ఒకే రకం పాత్రల్ని పోషించి - అంతకాలంపాటు, అన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణం ఆమె సహజ నటన.
 
 
==సినీ జీవితం==
మొదట జెమిని స్టూడియో నిర్మించిన [[చంద్రలేఖ]] సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరచిన మీదట 75 [[రూపాయి|రూపాయలు]] చేశారు. తరువాత [[ధర్మాంగద]] (1949)లో ఆమెది మూగవేషం. [[ధర్మాంగద]] టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత [[లీలా కుమారి]] సాయంతో మొదటిసారిగా [[నారద నారది]] సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకొంది.
 
 
ఆ పరిస్థితిలో సహాయ నటిగా [[గృహప్రవేశం]] సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం [[సౌదామిని]] చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత [[సంసారం]] చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.
 
 
అసలు [[సంసారం]] చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాక ముందే ఇంకొక హీరోయిన్ ను పెట్టుకొని తీశేసారని తెలియడంతో, "ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను" అని ఆ సినిమాను నిరాకరించింది. [[కోడరికం]] సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. [[బి.నాగిరెడ్డి]], [[చక్రపాణి]] లు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు.
 
 
ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]] - సూర్యకాంతం, [[రమణారెడ్డి]] - సూర్యకాంతం, [[ఎస్.వి.రంగారావు]] - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే ''అందులో సూర్యకాంతం వుందా?'' అని ప్రేక్షకులూ, ''తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా?'' అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. [[చక్రపాణి]] (1954), [[దొంగరాముడు]] (1955), [[చిరంజీవులు]] (1956), [[తోడికోడళ్లు]] (1957), [[అత్తా ఒకింటి కోడలే]] (1958), [[ఇల్లరికం]] (1959), [[భార్యాభర్తలు]] (1961), [[గుండమ్మకథ]] (1962), [[కులగోత్రాలు]] (1962), [[దాగుడు మూతలు (1964 సినిమా)|దాగుడుమూతలు]] (1964), [[అత్తగారు-కొత్తకోడలు]], [[మూహూర్తబలం]] (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది.
==వ్యక్తిత్వం==
వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానేకాదు - మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్లినప్పుడు ఆటోగ్రాపులకోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకి వెళ్లడానికి భయపడేవారు. ఐతే ఆమె నికార్సయిన మనిషి, కచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపునిండా తినేది, పదిమందికీ పెట్టేది. షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా - తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు [[సావిత్రి]], [[కృష్ణకుమారి]], [[జానకి]] వంటి నటీమణులకీ వుండేది. విశేష దినాలూ, పండగపబ్బాలూవస్తే సరేసరి!
 
 
షూటింగుల్లో జోకులు చెప్పడం, సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగులో బయట కేకలు వినిపిస్తున్నాయని ‘సైలెన్స్‌! అవుట్‌సైడ్‌’ అని ప్రొడక్షన్‌ మేనేజర్‌ గట్టిగా అరిచాడు. ఫ్లోర్‌లో వున్న సూర్యకాంతం ‘ఓ!’ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ‘ఏమిటమ్మా?’ అని అడిగితే, ‘సైలెన్స్‌ అవుట్‌ సైడ్‌ - అని గదా అన్నారు!’ అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి వుండేది ఆమెలో. ఓ సినిమాలో [[చిత్తూరు నాగయ్య|నాగయ్య]] ను నానామాటలూ అని, నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్‌ అయిపోయాక ఆయన కాళ్లమీద పడి ‘అపరాధం - క్షమించండి!’ అని వేడుకుంది. ‘పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావూ? లే!-’ అని నాగయ్య లేవనెత్తితే, కన్నీళ్లు తుడుచుకున్న భక్తీ, సెంటిమెంటూ ఆమెవి. దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషే అయినా, మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థికసహాయం చేసేదిగాని అనవసరం అనిపిస్తే మాత్రం ‘పూచికపుల్ల’ కూడా విదిలించేది కాదు.
 
 
మొహమాటపడకుండా తనకి రావాల్సిన పారితోషకాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందర్నీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకొస్తే ఎంత పెద్ద రిపేరైనా, మెకానిక్‌ ఇంటికొచ్చి తన కళ్లముందు చెయ్యవలసిందే - ఎంత ‘ఎక్స్‌ట్రా మనీ’ అయినా తీసుకోనీగాక! చివరి దశలో వేషాలు తగ్గిపోయినా, చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగులేకపోయినా, ‘నటిస్తాను’ అని ధైర్యంగా చెప్పేది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1762487" నుండి వెలికితీశారు