పరిచారిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
 
* (5) తప్పులని సరిచేసే సంక్షిప్త లిపితో ఉన్న కొట్టు లేదా కోఠీ (Error Correcting Code RAM or Self-testing RAM): ఇలాంటి హంగులు అన్నీ కావాలంటే తడిపి మోపెడు అవుతుంది కనుక ఎవరికి కావలసిన హంగులు వారు కొనుక్కుంటారు. టూకీగా ఇదీ పరిచారికల కథ.
==ముక్తాయింపు==
ముక్తాయింపుగా - కంప్యూటరు రంగంలో పరిచారిక (server) అంటే
* స్థూలకాయం దృష్టితో: పరిచారిక అనేది ఒక వలయంలో ఉన్న కంప్యూటర్లు అన్నింటిలో ఎక్కువ పెద్దదీ, శక్తిమంతమైనదీ, పెద్ద కొట్టు (కోఠీ) ఉన్నదీ, పరిచారిక సూక్ష్మకాయం (server software) నివసించడానికి అభ్యాగతి (host) వలె ఉంటూ, ఆ వలయంలో ఉన్న మిగిలిన కంప్యూటర్లకి (clients) ఉమ్మడి పరిచర్యలు (shared services) అందించేది. ఉమ్మడి పరిచర్యలు కి ఉదాహరణలు: అంతర్జాలంతో లంకె కలపడం, దస్త్రాలని ముద్రించడం వగైరా. ఈ పరిచర్యలకి చేసే పరిచర్యని ప్రతిబింబించేలా పేర్లు పెడతారు. ఉదాహరణకి దస్త్ర పరిచారిణి చేసే పనులు: దస్త్రాలని పుచ్చుకోవడం, పంపడం, దాచడం. జాల పరిచారిణి జాల పుటలని దాచి, అడిగిన వారికి చూపించడం. టపా పరిచారిణి ఇ-టపాలని పంపడం, అందుకోవడం, దాచడం, మరొకరికి రవాణా చెయ్యడం, వగైరా.
 
* సూక్ష్మకాయం దృష్టిలో: పరిచారిక అనేది ఒక క్రమణిక (program). క్లయంట్-సెర్వర్ స్థాపత్యశిల్పంలో సెర్వర్ వైపు ఉండే భాగం. ఈ భాగం చెయ్యవలసిన ముఖ్యమైన పనులు: (1) కేంద్రీకరణ (చcentralizatio). సాధారణంగా వలయంలో ఉన్న కంప్యూటర్లు అన్నింటిలో పెద్దదిగా ఉండి, కేంద్ర స్థానంలో ఉన్న కంప్యూటరు మీద నివసిస్తుంది. (2) అతిథి (client) ఏదైనా ఒక పని చెయ్యమని అడిగే వరకు ఏ పనీ చెయ్యదు. (3) సతతం, విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటుంది, లేదా పని చెయ్యడానికి తయారుగా ఉంటుంది. (4) నేపథ్యంలో ఉండి పని చేస్తుంది తప్ప వాడుకరితో (అతిథిలో ఉన్న క్రమణికల ద్వారా తప్ప) సంభాషించదు. (5) ఎంతమంది అతిథులు ఒకేసారి పరిచర్యలు కావాలని అడిగినా అంతమందికీ ఒకేసారి పరిచర్యలు అందిస్తుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పరిచారిక" నుండి వెలికితీశారు