పరిచారిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
ఉదాహరణకి మన పరిచారిక "దస్త్రాల పరిచారిక" (file server) అనుకుందాం. అప్పుడు ఈ పరిచారిక తనలో ఉన్న దస్త్రాలని ఇతర కంప్యూటర్లు వాడుకోడానికి వెసులుబాటు కలుగజేస్తుంది. మన దగ్గర ఉన్న పరిచారిక "ముద్రణ పరిచారిక" (print server) అనుకుందాం. అప్పుడు అది వలయంలో ఉన్న కంప్యూటర్లు అన్నీ ఉమ్మడిగా ఒక ముద్రాపకిని (printer) వాడుకోడానికి వెసులుబాటు కల్పిస్తుంది: ముద్రించవలసిన దస్త్రాలని ఈ ముద్రణ పరిచారిక పర్యవేక్షణలో ముద్రిస్తాము. జాల పరిచారిక (web server) జాలంలో ఉన్న జాల స్థలాలు (web sites) వద్దకి వెళ్లి అక్కడ ఉన్న సమాచారాన్ని మనకి చూపిస్తుంది. ఇలా ఎన్నో రకాల పరిచర్యలు చేయగలవు ఈ పరిచారికలు. కనుక, పరిచారిక అంటే మరేమీ కాదు; అది ప్రత్యేకమైన పనులు చెయ్యడానికి కేటాయించబడ్డ మరొక కంప్యూటరు. పరిచారిక ఒక నెట్‌వర్క్ లో ఉన్న ఇతర కంప్యూటర్లకి పరిచర్యలు అందించే కంప్యూటరు.
 
పరిచారకులు పరిచర్యలు అందించే యంత్రాలు కనుక వీటిని అధ్యయనం చేసేటప్పుడు ఒక ఉపమానాన్ని తరచు వాడుతూ ఉంటారు. ఈ ఉపమానాన్ని ఇంగ్లీషులో “క్లయంట్-సెర్వర్ నమూనా” (Client-Server model) అంటారు. దీనిని తెలుగులో “భోక్త-అభ్యాగతి" నమూనా అనొచ్చు. పరిచర్యలు చేసే శాల్తీ అభ్యాగతి (host or server), పరిచర్యలు అందుకునే శాల్తీ భోక్త (consumer or client) అని వివరణ చెప్పుకోవచ్చు.
 
పరిచారిక అనేది కూడ ఒక కంప్యూటరే కనుక, పరిచారికలలో కూడ రెండు భాగాలు ఉంటాయి: స్థూలకాయం ([[హార్డ్‌వేర్|hardware]]), ఆ స్థూలకాయానికి ప్రాణం పోసే నిరవాకి (operating system) అనే సూక్ష్మకాయం ([[సాఫ్ట్‌వేర్|software]]). ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది కనుక మనం "పరిచారిక" అన్నప్పుడు ఈ రెండు కలసి ఉన్న కంప్యూటరుని ఉద్దేశించి అయినా కావచ్చు, లేదా కేవలం నిరవాకిని ఉద్దేశించి అయినా కావచ్చు. "రామయ్య" అన్నప్పుడు ప్రాణం లేని కట్టెని సంబోధిస్తున్నామా, లేక కట్టెలో ఉన్న ఆత్మని సంబోధిస్తున్నామా, లేక రెండింటిని కలిపి సంబోథిస్తున్నామా? అలాగే ఇక్కడ కూడా. సమయానుకూలంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పరిచారికలలో వాడే నిరవాకి గురించి తెలుసుకుందాం.
పంక్తి 36:
* స్థూలకాయం దృష్టితో: పరిచారిక అనేది ఒక వలయంలో ఉన్న కంప్యూటర్లు అన్నింటిలో ఎక్కువ పెద్దదీ, శక్తిమంతమైనదీ, పెద్ద కొట్టు (కోఠీ) ఉన్నదీ, పరిచారిక సూక్ష్మకాయం (server software) నివసించడానికి అభ్యాగతి (host) వలె ఉంటూ, ఆ వలయంలో ఉన్న మిగిలిన కంప్యూటర్లకి (clients) ఉమ్మడి పరిచర్యలు (shared services) అందించేది. ఉమ్మడి పరిచర్యలు కి ఉదాహరణలు: అంతర్జాలంతో లంకె కలపడం, దస్త్రాలని ముద్రించడం వగైరా. ఈ పరిచర్యలకి చేసే పరిచర్యని ప్రతిబింబించేలా పేర్లు పెడతారు. ఉదాహరణకి దస్త్ర పరిచారిణి చేసే పనులు: దస్త్రాలని పుచ్చుకోవడం, పంపడం, దాచడం. జాల పరిచారిణి జాల పుటలని దాచి, అడిగిన వారికి చూపించడం. టపా పరిచారిణి ఇ-టపాలని పంపడం, అందుకోవడం, దాచడం, మరొకరికి రవాణా చెయ్యడం, వగైరా.
 
* సూక్ష్మకాయం దృష్టిలో: పరిచారిక అనేది ఒక క్రమణిక (program). “భోక్త-అభ్యాగతి" (క్లయంట్-సెర్వర్) స్థాపత్యశిల్పంలో సెర్వర్అభ్యాగతి వైపు ఉండే భాగం. ఈ భాగం చెయ్యవలసిన ముఖ్యమైన పనులు: (1) కేంద్రీకరణ (చcentralizatiocentralization). సాధారణంగా వలయంలో ఉన్న కంప్యూటర్లు అన్నింటిలో పెద్దదిగా ఉండి, కేంద్ర స్థానంలో ఉన్న కంప్యూటరు మీద నివసిస్తుంది. (2) అతిథి (client) ఏదైనా ఒక పని చెయ్యమని అడిగే వరకు ఏ పనీ చెయ్యదు (passivity). (3) (continuous operation) సతతం, విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటుంది, లేదా పని చెయ్యడానికి తయారుగా ఉంటుంది. (4) (background operaion) నేపథ్యంలో ఉండి పని చేస్తుంది. తప్ప వాడుకరితో (అతిథిలో ఉన్న క్రమణికల ద్వారా తప్ప) సంభాషించదు. (5) (simultaneous operation) ఎంతమంది అతిథులు ఒకేసారి పరిచర్యలు కావాలని అడిగినా అంతమందికీ ఒకేసారి పరిచర్యలు అందిస్తుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పరిచారిక" నుండి వెలికితీశారు