మేఘ సందేశం (సంస్కృతం): కూర్పుల మధ్య తేడాలు

==వనరులు, బయటి లింకులు==
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''మేఘ సందేశం''' లేదా '''మేఘదూతం''' (Meghasandesam or Meghadiootam) [[సంస్కృతం]]లో మహాకవి [[కాళిదాసు]] రచించిన ఒక కావ్యము. కాళిదాసు రచించిన 'కావ్యత్రయం' అని పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి. (మిగిలిన రెండు '[[రఘు వంశము]]', '[[కుమార సంభవము]]')
 
==కావ్య ప్రశస్తి==
కేవలం 111 శ్లోకాలతో కూడిన ఈ చిన్నకావ్యము కాళిదాసు రచనలలోను, సంస్కృత సాహిత్యంలోను విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. కుబేరుని కొలువులో ఉన్న ఒక యక్షుడు కొలువునుండి ఒక సంవత్సరం పాటు బహిష్కారానికి గురవుతాడు. ఆ యక్షుడు హిమాలయాలలోని కైలాసగిరిపైనున్న అలకాపురిలో నున్న తన ప్రియురాలికి ఒక మేఘం ద్వారా సందేశం పంపుతాడు. మార్గసూచికంగా యక్షుడు ఆ మేఘానికి హిమాలయాలకు పోయే దారిలోనున్న పెక్కు దృశ్యాలను వర్ణిస్తాడు.
 
1813లో ఈ కావ్యం 'హోరేస్ హేమాన్ విల్సన్' (Horace Hayman Wilson) చే ఆంగ్లంలోనికి అనువదింపబడింది.
 
 
మేఘ సందేశంలో శ్లోకాల సంఖ్యపై కొంత అనిశ్చితి ఉన్నది. మూల కావ్యంలో 110 లేదా 111 శ్లోకములని అంటారు. పూర్వ మేఘంలో 63, ఉత్తర మేఘంలో 48 శ్లోకాలున్నాయని 'సుశీలకుమార దేవుడు' చెప్పఅడు. వావిళ్ళవారి ప్రతిలో 124 శ్లోకాలు, మరి కొన్ని ప్రతులలో 129 శ్లోకాలు చెప్పబడ్డాయి. <ref> కోసూరు వెంకట నరసింహరాజు రచన </ref>
 
మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు వర్ణనా నైపుణ్యము, అలంకార పటిమ, పాత్ర చిత్రణ, శృంగార ప్రస్తావన అద్భుతంగా కనిపిస్తాయి. ఇంకా వివిధ భౌగోళిక అంశాలు చెప్పబడ్డాయి. సంక్షిప్తంగా కావ్యంలో ఉన్న విషయం ఇది.
 
==పూర్వ మేఘం==
 
ఒక యక్షుడు కర్తవ్యాన్ని విస్మరించడం వలన కుబేరుని ఆగ్రహానికి గురియై, బహిష్కరింపబడి, ఒక సంవత్సరం పాటు 'చిత్రకూటం' వద్ద 'రామగిరి' అరణ్యాలలో తిరుగాడుతూ ఉన్నాడు. ప్రియురాలి ఎడబాటుతో విహ్వలుడై ఉన్న అతనికి ఆషాఢం సమీపించినపుడు ఒక మబ్బుతునక అతనికంటబడింది. తన వియోగంతో తన ప్రేయసి కృశించి దుఃఖిస్తూ ఉంటుందని తలచిన ఆ యక్షుడు ఎలాగో ప్రేయసిని ఊరడించడానికి తన సందేశాన్ని ఆమెకు అందించమని కోరుతాడు. "పుష్కలావర్త సంభూతుడు" అయిన మేఘుడు ఉత్తమ కుల సంజాతుడు గనుక ఒకవేళ తన అభ్యర్ధనను తిరస్కరించినా 'యాచనా లాఘవము' (చిన్నతనము) ఉండదని భావించి అతనిని ప్రార్ధిస్తాడు. మేఘుడు వెళ్ళవలసిన మార్గాన్నీ, మధ్యలో కానవచ్చే దృశ్యాలనూ వర్ణిస్తాడు.
 
మిత్రమా! గాలి పాటు నీ ప్రయాణానికి అనుకూలంగా ఉంది. శుభ శకునాలు కనుపిస్తున్నాయి. హంసలు నీకు మానస సరోవరం దాకా తోడు వస్తయి. దారిలో అలసిపోతే కొండ కొనలపై విశ్రాంతి తీసుకో. శక్తి ఉడిగితే మధురమైన నదీజలాలను ఆస్వాదించు. మధ్యలో పొటమరించిన కార్చిచ్చును ఆర్చేవాడవు గనుక నఇన్ను ఆమ్రకూటం మరువలేదు.
 
 
 
 
==మూలాలు==
<references/>
 
==వనరులు, బయటి లింకులు==
Line 13 ⟶ 30:
* [http://www.ch.8m.com/megh.htm కావ్యం గురించిన పరిచయ వ్యాసం]
* [http://www.geocities.com/jaffor/purva/index.html చక్కని బొమ్మలతో, బెంగాలీ, ఆంగ్ల అనువాదాలతో ]
 
 
[[Category:కాళిదాసు]]