మేఘ సందేశం (సంస్కృతం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
అలకానగరం శోభ వర్ణనతో ఉత్తర మేఘం భాగం ఆరంభమౌతుంది. యక్షుడు మేఘునితో తన సంభాషణను ఇలా కొనసాగిస్తాడు -
 
మిత్రమా! అలకానగరం వర్ణనకు అలవి గానంత అందమైనది. అక్కడి అనేకమైన మేడలు నీతో సమానంగా అంబరాలనంటుతుంటాయి. నీ మెరుపు నెచ్చెలి ఎప్పుడూ నిన్నంటిపెట్టుకొని ఉన్నట్లుగా ఆ భవనాలలో సుందరాంగులు శోభాయమానంగా ఉంటారు. వర్ణ చిత్రాలతో, మధుర సంగీత నాదాలతో, ఇంద్రనీల కాంతులతో ఆ భవనాలు అలరారుతుంటాయి. అక్కడ కుబేరుని ప్రాసాదమునకు ఉత్తరాన [[ఇంద్రధనుస్సు]]లా ఉండే నా భవనం దూరాన్నుంచే కనిపిస్తుంది.[[కల్పవృక్షము]], [[నీలమణిఖచితమైన సోపానములు గల బావి, కృతక పర్వతము, కన్నులకింపైన [[వకుళ]],[[ అశోక]] వృక్షములు, ద్వారమున రమ్యమైన శంఖ పద్మములు - ఇవి నాయింటి గురుతులు.