అగ్నికులక్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అగ్నికులక్షత్రియులు''' అనునది ఒకానొకప్పుడు దేశవ్యాప్తంగా ప్రబలియున్న గొప్ప పాలకవంశము. ఇది ఏవో కొన్నిరాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన కులము కాదు. అగ్నికులక్షత్రియులు ప్రధానంగా [[వ్యవసాయము]], [[నౌకానిర్మాణము]], [[శిల్పకళ]], దేవాలయ అర్చకత్వములను వృత్తులుగా కలిగియుండేవారు. [[పల్లవులు]] ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేసిన నౌకానిర్మాణము, నౌకాయానము, నౌకావ్యాపారము 50సం||ల క్రిందటివరకు అగ్నికులక్షత్రియుల ఆధ్వర్యంలోనే నడిచింది. పల్లవులు అభివృద్ధి పరచిన దేవాలయవ్యవస్థ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అగ్నికులక్షత్రియుల ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. అగ్ని పదమునకు సంస్కృత పదము 'వహ్ని'. 'వహ్ని'కి వికృతి 'వన్ని'.
===పుట్టుపూర్వోత్తరాలు===
ఉత్తర భారతదేశంలో మౌర్య, శుంగ వంశములు అంతరించుట వల్ల, అప్పటికే కావేరి, గంగా నదుల మధ్య, తూర్పు పశ్చిమ సముద్రముల మధ్య విస్తరించియున్న ఆంధ్రమహాసామ్రాజ్యాన్ని శాతవాహన వంశజులైన రాజపుత్రులు అల్పరాజ్యములను స్థాపించుట వలన సరైన నాయకత్వము లేకపోవుట వల్ల, పరదేశీయుల దాడినుండి దేశమును రక్షించగల చక్రవర్తిత్వం కొరకు అప్పటి పీఠాధిపతులు బ్రాహ్మణరాజవంశములనుండి వీరులగు నలుగురును ఏరి వారియందు బ్రహ్మతేజస్సును, క్షాత్రతేజస్సును నిలుచునట్లు సంకల్పించి వారిచేత హోమాదులను చేయించి, దేశమును నాలుగు భాగములుగాచేసి ఆ నలుగురిని అధినాయకులుగా చేశారు. ఆ నలుగురు తమ నాయకత్వమును అంగీకరించిన సామంతరాజులతో కలిసి విదేశీయుల దాడులనుండి దేశమును కాపాడారు. ఈ నాలుగువంశముల వారు అగ్నికులక్షత్రియులు అని పిలువబడ్డారు. అగ్ని దేవతలలో బ్రాహ్మణుడు. బ్రాహ్మణవర్ణమందు పుట్టి క్షాత్రమవలంబించిన వాడు "అగ్నికులక్షత్రియుడు”. వీరి నాయకత్వమును అంగీకరించిన వారిలో శాతవాహనుల సామంతులైన పల్లవులుఉన్నారు.