బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
==సంగీత సేవ==
[[కర్ణాటక]] సంగీతములో నాగరత్నమ్మ తనదైన ఒక కొత్త [[బాణీ]]ని సృష్టించుకొన్నది. ఆమెకు త్యాగరాజ కృతులంటే ఎంతో ఇష్టము. [[సాహిత్యము]]ను చక్కగా అర్థము చేసికొని హృదయములో హత్తుకొనేటట్లు పాడగలిగేది. మాతృభాష [[కన్నడము]] లోని దేవరనామములు ఆసక్తిగా పాడేది. అమె గళములో స్త్రీ కంఠములోని మాధుర్యముతో పాటు పురుష స్వరపు గాంభీర్యము కూడ మిళితమై వినసొంపుగా ఉండేది. సంగీత శాస్త్రాధ్యయనముతో బాటు నాట్య, అభినయ శాస్త్రములలో ఆమెకు పరిచయము ఉన్నందువలన ఆమె [[సంగీతము]] భావభరితము . ఆమె కచ్చేరులలో స్వరకల్పన కన్న రాగాలాపనకు ప్రాముఖ్యత అధికము. [[యదుకుల కాంభోజి రాగము]] పాడని కచ్చేరీలు అరుదు.
 
==సాహిత్య సేవ==