చిక్కుడు: కూర్పుల మధ్య తేడాలు

అనప కాయని దీనితో విలీనం చేసేను
పంక్తి 33:
 
పందిరి చిక్కుడును ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. తమిళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దీన్ని విస్తారంగా సాగుచేస్తున్నారు. ఇప్పుడిప్పడే ఉత్తర భారతదేశంలో ఇది ప్రాచుర్యం పొందుతోంది. రాష్ట్రంలో చిక్కుడుజాతి కూరగాయలు 12వేలకు పైగా హెక్టార్లలో పండిస్తూ ఏటా 70వేలకు పైగా టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. పందిరి చిక్కుడు కాయలను కూరగాయగా, ఎండిన విత్తనాలను పప్పుదినుసుగా వాడతారు. ఫ్రెంచిచిక్కుడుతో పోల్చితే దీనిలో పోషక విలువలు అధికం. ప్రతి వంద గ్రా. చి క్కుడు 48 కేలరీల శక్తిని ఇస్తుంది. -- బీన్స్ ఎక్కువగా, వరి అన్నం తక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని కోస్టా రికా అధ్యయనంలో తేలింది. దాదాపు రెండువేల మంది మహిళలు, పురుషుల మీద నిర్వహించిన పరిశోధనలో ఎక్కువ బీన్స్‌ను తక్కువ మోతాదులో అన్నాన్ని తీసుకునే వారిలో మధుమేహం తగ్గుముఖం పట్టిందని తేలింది. బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా 25 శాతం వరకు డయాబెటిస్‌ను నియంత్రించవచ్చునని తెలిసింది. అలాగే వరి అన్నం శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది కాబట్టి రైస్‌ను కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం ఎంతో మంచిదని బోస్టన్‌లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఫ్రాంక్ హు తెలిపారు. వరి అన్నం కంటే బీన్స్‌లో ఫైబర్, ప్రోటీన్స్ ఉండటంతో మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తుందని ఫ్రాంక్ వెల్లడించారు.
 
==అనపకాయ==
[[దస్త్రం:Anapakaayalu.JPG|thumb|right|అనపకాయలు. పాకాల సంతలో తీసిన చిత్రము]]
 
'''అనపకాయ''' లేదా "అనుములు" అనేది చిక్కుడు జాతికి చెందిన ఒక కాయ. ఇది తీగ చిక్కుడు జాతికి చెందినది. (గోరు చిక్కుడు కాదు) దీని కాయలు పలచగా చిక్కుడు కాయల వలేనుండి. దీని మొక్క తీగ జాతికి చెందినది. దీనిని ఎక్కువగా రాయల సీమ ప్రాంతంలో వర్షాధార పంటగా - వేరుశనగ లో అంతర పంటగా - పండిస్తారు. దీని గింజలను అనేక విదములుగా ఉపయోగిస్తారు. కూరలకు, గుగ్గిళ్ళు చేయడానికి ఎక్కువగా వుపయోగిస్తారు.
 
* '''ఆనప''' కాయకు అనేది వేరు. ఆనపకాయ అనగా సొర కాయ అని అర్థము.
 
 
==బీన్స్‌తో గుండెకు మేలు==
"https://te.wikipedia.org/wiki/చిక్కుడు" నుండి వెలికితీశారు