మాగ్నా కార్టా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arkumar 147 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Arkumar 147 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 17:
మాగ్నా కార్టా నుంచి అమెరికా రాజ్యాంగ సభ, ఫ్రెంచ్ విప్లవం, వలస పాలనకు వ్యతిరేకంగా సకల దేశాల్లో కొనసాగిన స్వాతంత్య్ర పో రాటాల వరకు తిరుగులేకుండా ప్రకటించిందీ, నిలబెట్టిందీ ఈ ప్రజా సార్వ భౌమాధికారాన్నే. రాజు అధికారానికి కోత పడి ప్రజాధికారానికి బీజాక్షరాలు పలికిన చరిత్రకు నిలువెత్తు దర్పణం. మాగ్నా కార్టా.. అధి కారం చేతులు మారి ప్రజల పరమవుతున్న పరిణామం నెమ్మదిగా వివి ధ రూపాల్లో చరిత్రలో నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే.. ఇంత సుదీర్ఘకాలం తర్వాత కూడా ప్రజలకు నిజమైన అధికారం ప్రపంచంలో ఏ దేశంలోనూ వాస్తవార్థంలో సిద్ధించకపోవడమే అసలైన విషాదం. అంతమాత్రాన 1215 జూన్ 15న బ్రిటన్ రాజు జాన్ తన విధేయులకు తలొగ్గి చేసిన ఆ తొలి అధికారమార్పిడి సంతకం విలువ ఏమాత్రం తగ్గ దు. స్వాతంత్య్రం కోసం మనిషి అనంతరీతుల్లో సాగిస్తున్న ప్రతి ప్రయ త్నంలోనూ నేనున్నానంటూ ఆ స్వేచ్ఛాపత్రం గుబాళిస్తూనే ఉంది.
[[image:Magna_Carta_(British_Library_Cotton_MS_Augustus_II.106).jpg|right|250px|మాగ్నా కార్టా, వ్యక్తి స్వేచ్ఛ-హక్కుల పత్రం]]
వివిధ నాగరికతల్లో రాజులు ప్రజల కోసం రూపొందించిన చట్టా ల గురించి మనం చదువుకున్నాం. యూదులకు మోసెస్, భారతదేశం లో మనువు, మెసొపొటేమియాలో హమురాబీ, చైనాలో కన్ఫ్యూసియ స్, రోమ్‌లో జస్టీనియన్ వంటి వారు ఈ కోవకు చెందుతారు. వీరంతా ప్రజలకు న్యాయ స్మృతులను రాజు తరఫున అందించినవారు. కానీ ఈ న్యాయం తిరగబడిన చరిత్రకు తొలి సంకేతం మాగ్నా కార్టా. అంత వరకు అలవిమాలిన పన్నులను విధిస్తున్న రాజునుంచి అతడి సామం తులు తమ హక్కులను డిమాండ్ చేసి లాక్కున్న స్వేచ్ఛా పత్రమే మాగ్నా కార్టా. తన ఇచ్ఛే చట్టం కానవసరం లేదని, చట్టం కంటే తాను ఉన్నతుడిని కానని చరిత్రలో ఒక చక్రవర్తి తప్పనిసరి పరిస్థితుల్లో అంగీ కరించి చేసిన అద్వితీయ సంతకం అది. నీవెంత ఉన్నత స్థానంలో ఉన్నా నీకంటే పైనే న్యాయం, శాసనం ఉంటుందని చాటిందది.
|