బొల్లిముంత శివరామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
'''బొల్లిముంత శివరామకృష్ణ''' ([[నవంబరు 7]], [[1920]] - [[జూన్ 7]], [[2005]]) అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు మరియు [[హేతువాది]]. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆంధ్రులపై చూపుతోన్న వివక్షని [[తరిమెల నాగిరెడ్డి]] చేత పలికించిన రచయిత.. తెలుగు సాహితీ లోకంలో ఆయన నిశ్శబ్ద విప్లవం, మార్క్సిస్టు గాంధీ అని కూడా అంటారు. ''[[మనుషులు మారాలి]]'' సినిమా సంభాషణకర్త ఆయనే.
==జీవిత విశేషాలు==
[[గుంటూరు జిల్లా]] [[వేమూరు]] మండలం [[చదలవాడ]] లో అక్కయ్య, మంగమ్మ దంపతులకు జన్మించిన శివరామకృష్ణ గుంటూరులోనే హయర్‌ గ్రేడ్ ట్రెయినింగ్ పూర్తిచేశారు. ఆయన తండ్రి చదలవాడలో పాఠశాల నెలకొల్పడంతో ఉపాధ్యాయుడిగా అందులోనే చేరారు. కవిరాజు [[త్రిపురనేని రామస్వామి చౌదరి]], [[త్రిపురనేని గోపీచంద్]] లతో పరిచయం కలిగింది. బాల్యంలో ఈయనపై జస్టిస్‌ పార్టీ ప్రభావం, త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం ఎక్కువగా ఉండేవి. అందుకు కారణం వారి తండ్రి గారికి రామస్వామి చౌదరి నడిపే బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం తోనూ, [[జస్టిస్‌ పార్టీతోనూపార్]]టీతోనూ సన్నిహిత సంబంధాలుండేవి. ఆ సంబంధాల ప్రభావం కొడుకు శివరామకృష్ణపై బాగా పడ్డాయి. ఈలోగా [[గోపీచంద్‌]] కథలు రాసి పత్రికల్లో అచ్చేస్తూ ఉండేవారు. మంచి పేరు వస్తూ ఉండేది. అది చూసి శివరామకృష్ణ కూడా వచనంలోకి మారారు. తనూ కథలు రాసి పత్రికలకు పంపాలని నిశ్చయించుకున్నారు. ఫలితంగా 1936లో మద్రాసు నుండి వెలువడే ‘చిత్రాంగి’ పత్రికలో తన తొలి కథ ‘ఏటొడ్డు’ ప్రచురించారు. అప్పుడాయన వయసు పదహారు సంవత్సరాలు.
 
==రచయితగా==
1945లో తన ఉపాధ్యాయ వృత్తిని వదలి వ్యవసాయ కార్మిక సంఘంలో చేరి చల్లపల్లి రాజాకి వ్యతిరేకంగా సాగిన భూపోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాట అనుభవాలతోనే తొలి రాజకీయ నవల ''మృత్యుంజయులు'' రాశారు. ''నగారా'' అనే పత్రిక నడిపారు. కొడవటిగంటి కుటుంబరావు రాసిన 'పిల్లి' అనే కథపై కొడవటిగంటి తిరోగమన యాత్ర'' అంటూ విమర్శ రాశారు. బెంగాల్ కరవుపై బుర్రకథ రాశారు. 'రైతుబిడ్డ' హరికథ రాశారు. ''సూక్ష్మంలో మోక్షం'', ''అంతరాత్మ అంత్యక్రియలు'', ''శివరామకృష్ణ కథలు'' బొల్లిముంతవే. ''ఏ ఎండకాగొడుగు, పత్రికా న్యాయం, తెలంగాణా స్వతంత్రఘోష, క్విట్ కాశ్మీర్, ధర్మసంస్థాపనార్థాయ... ఇలా ఎన్నో నాటికలు రాశారు. ''రాజకీయ గయోపాఖ్యానం, రాజకీయ కురుక్షేత్రం'' వంటి పద్యనాటకాలు రాశారు. ''దొంగ దొరికింది, భలేమంచి చౌకబేరం...'' వంటి రేడియో నాటికలు రాశారు. ''నేటి భారతం'' పేరుతో మూకీ నాటిక రాశారు. ప్రజానాట్యమండలి పునరుద్ధరణ సమయంలో బొల్లిముంత శ్రీకాంత్‌తో కలసి ''అందరూ బతకాలి'' నాటకం రాశారు. దీన్ని [[రక్తకన్నీరు నాగభూషణం]] వందకు పైగా ప్రదర్శనలిచ్చారు.