కుమారజీవుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 124:
 
==అనువాదకునిగా కుమారజీవుని విశిష్టతలు==
* [[పాళీ]], [[సంస్కృత భాష]] భాషలలోలలో వున్న మూల బౌద్ద గ్రంధాలు క్రీ.శ. 2 వ శతాబ్దం నుండి 13 వ శతాబ్దం వరకూ గల మద్య కాలంలో సుమారు 6,000కు పైగా చైనా దేశంలోనికి తరలించబడి వుంటాయని ఒక అంచనా. 200 మందికి పైగా ప్రముఖ అనువాదకులు ఈ వేలాది గ్రంధాలను పాళీ/సంస్కృత భాషలనుండి చైనా భాషలోనికి అనువదించారు. వీరందరిలో క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందిన కుమారజీవుడు, 7వ శతాబ్దానికి చెందిన [[హుయన్ త్సాంగ్]] లు అత్యంత ప్రముఖ అనువాదకులుగా చరిత్రలో పేరుపొందారు. వీరిలో కుమారజీవుడు జన్మతా భారతీయుడు కానప్పటికీ భారతీయ సంతతి (Indian Origion)కి చెందిన వ్యక్తి. ముఖ్యంగా ఒకవైపు బుద్దుడు జన్మించిన దేశంలో బౌద్దమత ప్రాభవం క్షీణిస్తున్న కాలంలోనే (మలి [[గుప్తుల]] కాలంలో), మరొవైపు విదేశాలలో ముఖ్యంగా చైనాలో బౌద్దమత గ్రందాల అనువాదం ద్వారా బౌద్ద మత వికాసానికి ఎనలేని కృషి చేసినవాడు కుమారజీవుడు.
 
* కుమారజీవుడు అనువాద శైలిలోను, ప్రక్రియా విధానంలోను సమూలమైన మార్పులు ప్రవేశపెట్టాడు. భావానికి ప్రాధాన్యం ఇస్తూ మృదుప్రవాహ శైలిలో అనువదించాడు. కుమారజీవుని అనువాదాలు ప్రస్తుత కాల పరిస్థితులలో సైతం అధ్యయనం చేయడానికి అనుకూలంగా వున్నాయంటే అతని అనువాదం ఎంత సరళంగా భావస్ఫురితంగా వుంటుందో అర్ధమవుతుంది. అనువాద ప్రక్రియలో కుమారజీవుడు ప్రవేశపెట్టిన బృహత్తర సామూహిక కృషి కూడా అంతకు ముందు అనువాదాల క్రియలో ఎన్నడూ లేదు. అనువాద ప్రక్రియను నిరంతరం కొనసాగించడం కోసం సంస్థాగత యంత్రాంగాన్ని(Institutional Mechanism) ఏర్పాటుచేయడం ద్వారా క్షేత్ర స్థాయిలో వందలాది స్వచ్చంద అనువాద సహాయకుల, సహకారాన్ని పొందగలిగాడు. అనువాద విధానాన్ని అనువాదకుల వ్యక్తిగత కృషి (individual effort) స్థాయి నుండి వ్యవస్థీకృత కృషి (organized effort) స్థాయికి తీర్చిదిద్ది తన తరువాతి అనువాదకులకు మార్గదర్శిగా నిలిచాడు.
"https://te.wikipedia.org/wiki/కుమారజీవుడు" నుండి వెలికితీశారు