సప్తచక్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[దస్త్రం:Yogin_with_six_chakras,_India,_Punjab_Hills,_Kangra,_late_18th_century.jpg|right|thumb|షట్చక్రాలను సూచించే పటం - 18వ శతాబ్దానికి చెందిన చిత్రం-కాంగ్రా శైలి]]
[[శ్రీ విద్య]] లోను, వివిధ తంత్రముల లోను చెప్పిన ప్రకారము మానవునియందు ఏడు చక్రములుండును.
==[[మూలాధార చక్రము]]==
గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే [[కుండలినీ శక్తి]] యుండును. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆలింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.
 
మూలాధారచక్ర అధిష్టాన దేవత “సిద్ధవిద్యాదేవి” సాకిణీ రూపములో ఉంటుంది. ఈ దేవతకు సంబధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ “స” కార సంబంధముగా ఉంటాయి. 514 నుండి 519 వరకూ గల నామములు “సాకిన్యంబ” ను వర్ణిస్తాయి. నామములు - మూలాధారామ్బుజారూఢ, పంచవక్తాృయ, ఆస్ధిసంసితాయ, అంకుశాది ప్రహరణాయ, వరదాది నిషేవితాయ, ముద్గౌదనాసక్తాయ.
 
<poem>
మూలాధారస్ధపద్మే, శృతి దళలసితే, పంచవక్త్రాం త్రినేత్రాం,
ధూమ్రాభా, మస్ది సంస్దాం సృణి మపి కమలం పుస్తకం జ్ఞానముద్రాం
బిభ్రాణం బాహుదండైస్సులలిత వరదా పూర్వ శక్త్యన్వితాoతం
ముద్గాన్నాసక్త చిత్తాం మధుమదముదితాం సాకినీ భావయామి:
</poem>
 
మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఇది షట్చక్రాలలో మొదటిది. ఇది నాలుగు దళాల పద్మము. ఈ మూలాధార చక్రములో ‘సాకిన్యాంబ’ నివసిస్తుంది. ఈమెకు ఐదు ముఖములు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. వజ్రేస్వరి. ఈ దేవతకి నాలుగు చేతులు. అంకుశము, కమలం, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.
 
సాకిన్యాంబ వరదాది దేవతలు : 1. వరద 2. శ్రియ 3. షండా 4. సరస్వతి ( వ, శ, ష, స అను మూలాక్షరాల) దేవతలచే కోలువబడుతూ ఉంటుంది. ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టము.
 
==[[స్వాధిష్ఠాన చక్రము]]==
లింగమూలమున గలదు. ఆరు దళములతో సింధూరవర్ణము గల జలతత్వ కమలము గలది.
"https://te.wikipedia.org/wiki/సప్తచక్రాలు" నుండి వెలికితీశారు