వేంకట రామకృష్ణ కవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Venkataramakrishnakavulu.jpg|right|200px]]
'''వేంకట రామకృష్ణ కవులు''' అనే పేరుతో జంటకవిత్వం చెప్పిన వారు [[ఓలేటి వేంకటరామశాస్రి]] మరియు [[వేదుల రామకృష్ణశాస్త్రి]]<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0003/817&first=1&last=568&barcode=2020120003815| [[ఆంధ్ర రచయితలు]] - [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]] పేజీలు 295-307]</ref>. వీరు 1909 సంవత్సరములో పిఠాపురసంస్థానంలో ప్రవేశించారు. నాటికి [[ఓలేటి వేంకటరామశాస్రి]] వయస్సు 26 సంవత్సరాలు. [[వేదుల రామకృష్ణశాస్త్రి]] 18 సంవత్సరాలు. సంస్థాన ప్రభువు [[రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు]] ఈ కవుల బుద్ధి చాకచక్యానికి కవితాధోరణికి ఆనందపడి అవధానము చేయడానికి అనుమతించాడు. ఏ సుముహూర్తంలో ఈ జంటకవులు ప్రభువు కంటపడ్డారో కానీ వీరి అభ్యుదయానికి నాంది పలికింది. దిగ్దంతులవంటి పండితుల సమక్షంలో జరిగిన అవధానములో వీరి లీలలు పలువురకు ఆనందాశ్చర్యాలను కలిగించాయి. [[రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు]] అవధానం తరువాత రూ.316/-లు పట్టుశాలువాలతో సత్కరించి తన పిఠాపురం సంస్థానానికి ఆస్థానకవులుగా నియమించాడు. వీరు ఆ సంస్థానంలో శతావధానము, శతవిధానము [గంటకు 100 పద్యాలు చెప్పుట], శతప్రాసము [ఒకేప్రాసతో 100 పాదాలు గంటలో చెప్పుట], అష్టావధానము మొదలైనవాటిని నిర్వహించి పండితుల, ప్రభువుల మెప్పు పొందారు. వీరు పిఠాపుర సంస్థానంలో ప్రవేశించిన వెనువెంటనే సుప్రసిద్ధులైన [[తిరుపతి వేంకటకవులు|తిరుపతి వేంకటకవులతో]] వాగ్యుద్ధం తటస్థించింది. రామకృష్ణకవులు వయసున చిన్నవారైనా ఆ కవుల కృతులలోని దోషాలను బయట బెట్టి 'శతఘ్ని' అనే ఖండన గ్రంథాన్ని ప్రకటించారు. ఈ వివాదం మొదట చక్కని కృతివిమర్శలతో ప్రారంభమై క్రమక్రమంగా శ్రుతి మించి వ్యక్తిదూషణాలకు దారితీసింది. ఏదిఏమైనా ఆనాటి ఈ వివాదం సాహిత్యప్రియులకు మంచి కాలక్షేపాన్ని కలిగించింది. ఈ వాక్సమరంలో దేశము లోని పండిత కవులెందఱో కలుగ చేసికొని పైకి వచ్చారు. ఇది సారస్వత చరిత్రలో మఱవరాని సరసఘట్టం. ఈ వివాదారంభంలో [[కవిత (మాసపత్రిక)|కవిత]] అనే మాసపత్రికను వీరు నెలకొల్పారు. ఈ పత్రిక తొమ్మిది ఏండ్లు అవిచ్ఛిన్నంగా సాగింది.
==రచనలు==