"కుమారజీవుడు" కూర్పుల మధ్య తేడాలు

==మరణం==
[[image:Kumārajīva sheli.JPG|thumb|కుమారజీవుని స్మారక పగోడా, Huxian ప్రాంతం - దీనిలోనే చితిజ్వాలలలో నాశనం కాకుండా మిగిలినిదిగా భావించబడిన కుమారజీవుని 'నాలుక' భద్రపరచబడింది.]]
క్రీ.శ.413 లో తన 69 వ సంవత్సరంలో కుమారజీవుడు చాంగన్ నగరం లోనగరంలో మరణించాడు. సాంప్రదాయం ప్రకారం కుమారజీవుడు మరణశయ్యపై వున్నప్పుడు తన ఆంతరంగిక శిష్యులతో ‘తన శరీర దహనం (Cremation) అనువాదకుడిగా తన విజయాన్ని నిరూపిస్తుందని, తను చేసిన అనువాదంలో బౌద్ద ధర్మానికి విరుద్దంగా ఏమైనా లోపాలుంటే చితి జ్వాలలు తన పార్దివ దేహాన్ని ఆసాంతం దహించివేస్తాయని, తన అనువాదంలో లోపాలు లేనట్లయితే తన నాలుక (tongue) తప్ప మిగిలిన దేహం మాత్రమే దహించబడుతుంద’ని చెప్పినట్లు ప్రతీతి. అతని మరణానంతరం శిష్యులు దీనిని నిరూపించడానికి ప్రయత్నించగా ఒక్క నాలుక మాత్రమె నాశనం కాకుండా మిగిలివుందని శిష్యులు గ్రహించినట్లు తెలుస్తుంది.
 
చాంగాన్ లో మరణించిన కుమారజీవుని చైనీయులు భారతీయునిగానే భావించి భారతీయ ఆచారాల ప్రకారమే అతనికి దహన సంస్కారాలు నిర్వహించారు. కుమారజీవుని కృషికి స్మారక చిహ్నంగా చైనాలోని ప్రాచీన చాంగన్ (Xian) నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో Huxian ప్రాంతంలో కుమారజీవ పగోడా నిర్మించి అతని అవశేషాలను (చితాభస్మాన్ని,చితిజ్వాలలలో నాశనంకాని నాలుక) భద్రపరిచారు.
 
==వారసత్వం==
7,316

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1770842" నుండి వెలికితీశారు