చందాల కేశవదాసు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
కొంతకాలం నాటకరంగానికి స్వస్తిచెప్పి తెలంగాణా అంతటా హరికథలు చెప్పారు. ఈయన విధిగా ప్రతిరోజు ఒక పాట, మూడు పద్యాలు చొప్పున కొన్ని సంవత్సరాలు రచన సాగించాడు. పాటలలో భక్తి భావం, సరళత్వం తొణకిసలాడుతుంటాయి.
 
1930-33ల మధ్య కేశవదాసు వ్రాసిన జాతీయ గీతాలను ప్రముఖ సినీ గాయకుడు [[సాలూరు రాజేశ్వరరావు]], అముల నరసింహారావులు పాడగా [[బెంగుళూరు]] లో రికార్డు చేశారు. ఈయన అనేక సినిమా స్క్రిప్టులతో పాటుగా, కేశవ శతకం, బలి బంధనం, [[సీతాకళ్యాణం]], [[రుక్మాంగద]], మేలుకొలుపులు, జోలపాటలు మొదలైన రచనలు చేశాడు. ఈయన ఆధ్వర్యంలో బాల భారత్ సమాజం వారు అనేక నాటకాలను ప్రదర్శించేవారు. "కనక తార", "లంకాదహనం" వంటి నాటకాలను సినిమాలుగా కూడా తీసారు. తన కళా ప్రదర్శనల ద్వారా పొందిన బంగారు కంకణాలను, పతకాలను దాచుకోకుండా సత్కార్యాలకోసం ఖర్చుచేసి మార్గదర్శకంగా నిలిచారు. హరికథా గానంతో వచ్చిన డబ్బుతో [[భద్రాచలం]] లో భక్తుల సౌకర్యార్థం బావి త్రవ్వించి, భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. [[కోదాడ]] మండలం [[తమ్మర]] లో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మింపజేశారు.
 
==ఉటంకింపులు==
"https://te.wikipedia.org/wiki/చందాల_కేశవదాసు" నుండి వెలికితీశారు