ప్రజాస్వామ్యం (1987 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
[[పరుచూరి బ్రదర్స్]] కథను రాసేప్పుడు వారిలో చిన్న సోదరుడైన [[పరుచూరి గోపాలకృష్ణ]] ఈ సినిమాను ఎలాగైనా తామే దర్శకత్వం వహించాలని ఆశించారు. ప్రముఖ అభ్యుదయ చిత్ర దర్శకుడు [[టి. కృష్ణ]] ఏదైనా కథ ఉంటే చెప్పమని [[పరుచూరి వెంకటేశ్వరరావు]]ను అడిగినప్పుడు ఆయన ఈ సినిమా కథాంశాన్ని చెప్పారు. ఆయనకు నచ్చడంతో ఈ సినిమాకు కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ రాయడానికి దర్శకత్వం టి.కృష్ణ వహించడానికి నిర్ణయించుకుని ఆ మేరకు పత్రికలకు ప్రకటించారు. ఇంతలో టి.కృష్ణ అకాలమరణం పొందడంతో సినిమా సందేహంలో పడింది. పరుచూరి సోదరులను సినీ పాత్రికేయుడు పసుపులేటి రామారావు ప్రజాస్వామ్యం సినిమా ఏమవుతుంది? అని ప్రశ్నించగా ఆ సినిమా ఆగదని గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ విషయాన్ని పత్రికల్లో చదివిన ఈతరం ఫిల్మ్స్ అధినేత, టి.కృష్ణ సన్నిహితుడు, నిర్మాత [[పోకూరి బాబూరావు]] తానే నిర్మాతగా వ్యవహరిస్తానని ముందుకురావడంతో పరుచూరి సోదరుల దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది.<ref name="లెవంత్ అవర్">{{cite book|last1=పరుచూరి|first1=గోపాలకృష్ణ|authorlink1=పరుచూరి గోపాలకృష్ణ|title=లెవంత్ అవర్|date=డిసెంబర్ 2008|publisher=వి టెక్ పబ్లికేషన్స్|location=హైదరాబాద్|pages=57-67|edition=2}}</ref>
 
== మూలాలు ==