ప్రజాస్వామ్యం (1987 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 13:
=== అభివృద్ధి ===
[[పరుచూరి బ్రదర్స్]] కథను రాసేప్పుడు వారిలో చిన్న సోదరుడైన [[పరుచూరి గోపాలకృష్ణ]] ఈ సినిమాను ఎలాగైనా తామే దర్శకత్వం వహించాలని ఆశించారు. ప్రముఖ అభ్యుదయ చిత్ర దర్శకుడు [[టి. కృష్ణ]] ఏదైనా కథ ఉంటే చెప్పమని [[పరుచూరి వెంకటేశ్వరరావు]]ను అడిగినప్పుడు ఆయన ఈ సినిమా కథాంశాన్ని చెప్పారు. ఆయనకు నచ్చడంతో ఈ సినిమాకు కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ రాయడానికి దర్శకత్వం టి.కృష్ణ వహించడానికి నిర్ణయించుకుని ఆ మేరకు పత్రికలకు ప్రకటించారు. ఇంతలో టి.కృష్ణ అకాలమరణం పొందడంతో సినిమా సందేహంలో పడింది. పరుచూరి సోదరులను సినీ పాత్రికేయుడు పసుపులేటి రామారావు ప్రజాస్వామ్యం సినిమా ఏమవుతుంది? అని ప్రశ్నించగా ఆ సినిమా ఆగదని గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ విషయాన్ని పత్రికల్లో చదివిన ఈతరం ఫిల్మ్స్ అధినేత, టి.కృష్ణ సన్నిహితుడు, నిర్మాత [[పోకూరి బాబూరావు]] తానే నిర్మాతగా వ్యవహరిస్తానని ముందుకురావడంతో పరుచూరి సోదరుల దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది.<br />
సినిమా చిత్రీకరణకు ముందు రాసుకున్న వెర్షన్ కథలో కీలకమైన పాత్రల్లో ఒకటి అయిన శారద పాత్ర ఉరిశిక్షతో మరణిస్తుంది. రషెస్ చూశాకా పరుచూరి వెంకటేశ్వరరావు సహరచయిత, సహదర్శకుడు అయిన గోపాలకృష్ణతో "శారద మరణిస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే కదా" అని ప్రశ్నించారు. శారద పాత్రను బతికిస్తే వాస్తవానికి దూరమైపోతుందని గోపాలకృష్ణ సందేహించినా, నిర్మాత బాబూరావు కూడా ఆ పాత్ర బతికితేనే బావుంటుందని భావించారు. దాంతో కథలో ముఖ్యమైన మార్పులు జరిగాయి.<ref name="లెవంత్ అవర్">{{cite book|last1=పరుచూరి|first1=గోపాలకృష్ణ|authorlink1=పరుచూరి గోపాలకృష్ణ|title=లెవంత్ అవర్|date=డిసెంబర్ 2008|publisher=వి టెక్ పబ్లికేషన్స్|location=హైదరాబాద్|pages=57-67|edition=2}}</ref>
=== నటీనటుల ఎంపిక ===
|