చాకలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] లోని (A) ఏ గ్రూపు [[కులం]]. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే వృత్తి . బి.సి. ఏ గ్రూపు కులస్తులు. [[రజకులు]] అని కూడా పిలుస్తారు.. వీరు ముందురోజు గ్రామాల్లో బట్టలు తెచ్చి, మరుసటి రోజు తెల్లవారు జామున చాకిరేవుకు వెళ్తారు. ఇంటిల్లపాది చెరువులు కాలువలలో బట్టలు ఉతికి సాయంత్రం ఇంటికి చేరుతారు. కొంతమంది తల్లిదండ్రులు తమ వెంట పిల్లలను తీసుకురావడంతో వారు నిరక్షరాస్యులుగా తయారవుతున్నారు. బట్టలు ఉతకటానికి కావలసిన చాకలికారం, బట్టలసోడా, సబ్బుల ధర పెరగడంతో కొనుగోలు చేయకపోతున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే రజకవృత్తి అతికష్టంగా ఉంటోందని, వేసవికాలమైతే నీటికి ఇబ్బందులు తప్పేటట్టు లేవని వీరు అంటున్నారు. శ్రమకు తగ్గ కూలి గిట్టుబాటు కావడంలేదని, చాకి రేవు (దోబీఘాట్‌) లను నిర్మించి, ఇస్త్రీ పెట్టెలు, ఇత్తడి పాత్రలు, వాషింగ్‌ మెటీరియల్‌ తక్కువ ధరకే మంజూరు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం వీరిలో చాలామంది ప్రభుత్వము కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను విద్యావంతులుగా చేస్తున్నారు. దీనికి తోడు బట్టలు ఉతికే యంత్రాల రాకతో వీరు ఈ వృత్తిని వదిలి, వేరే వృత్తులలో స్థిరపడుతున్నారు. పట్టణాలలో బట్టలు ఉతకడం పెద్ద పరిశ్రమ గా ఉన్నది. రైల్వేలు, ఆసుపత్రులు, పెద్ద హోటళ్లు మొదలగు వాటికి సంబంధించి బట్టలు ఉతికే పని భారీగానే ఉంటున్నది. కాని ఆ పనిని వేరే కులాల వారు చేజిక్కించుకొని, యంత్రాలతో, చాకలి కూలీలతో చేయించు కుంటున్నారు. చాకలి కులస్తులకు అంత ఆర్ధిక పరిస్థితి లేనందున అటు వంటి పనులు వీరికి దక్కడం లేదు. కనీసం డ్రై క్లీనింగు దుకాణాలను కూడ వీరు దక్కించుకోలేక పోతున్నారు.
బసవ పురాణంలో మడివాలు మాచయ్య కథ ఉంది. మడివాలు ఆంటే చాకలి అని ఆర్థం. వీరిని గురించి తెలిపే పురాణాన్ని మడేలు పురాణం అంటారు. మడివాలు పదం లోపదీర్ఘత వల్ల మడేలు అయింది.
[[దస్త్రం:Caakirevu at musi.JPG|thumb|right|చాకి రేవు]]
గతంలో చాకలి వారు పల్లెల్లో రెండు మూడు పల్లెలకు కలిసి ఒక చాకలి కుంటుంబం ఉండేది. వారు ప్రతి రోజు, ప్రతి ఇంటికి వెళ్ళి, మాసిన బట్టలను మూట గట్టి గాడిదలపైన వేసుకొని దగ్గర్లోని చెరువుకో, వాగులు, వంకలకో వెళ్ళి అక్కడ బట్టలన్నీ ఉతికి సాయంకాలానికి ఎవరి బట్టలను వారి ఇళ్ళకు చేర్చేవారు. ఎవరి బట్టలను వారికే ఇచ్చేవారు. ఏ మాత్రం పొరబాటు జరిగేది కాదు. అందుకే ''చదివినోడికన్నా చాకలోడు మిన్న '' అనే సామెత వాడుకలోకి వచ్చింది. మధ్యాహ్నం ఒక చాకలి ఇల్లిల్లు తిరిగి అన్నం, కూర ఒక బుట్టలో వేయించుకుని వెళ్ళేవారు. అదే విధంగా రాత్రికి కూడ ప్రతి ఇంటివారు చాకలికి కొంత అన్నం, కూర వేయాలి. వారు అన్నాన్ని సేకరించడానికి ఒక బుట్ట, కూరలకు ఒక గిన్నె వెంట తెచ్చుకునేవారు. ఇంటివారు ఒక్కొరకం కూరలు ఆ గిన్నెలోనే వేసేవారు. అవి అన్ని కలిసి పోయేవి. ఆకారణంగానే .... అనేక రకాల రుచులు కలిగిన కూరను ''ఇది చాకలి కూర లాగ ఉన్నదే '' అని అంటుంటారు. ఆవిధంగా పుట్టింది ఈ సామెత.
"https://te.wikipedia.org/wiki/చాకలి" నుండి వెలికితీశారు