ఇప్పగూడెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయం ప్రధాన దేవాలయంగా విరాజిల్లుతుంది. ఈ ఆలయంలో యాదలక్ష్మిదేవి, చెంచులక్ష్మిదేవి సమేతంగా వేణుగోపాల స్వామి కొలువై ఉన్నారు. ప్రతి ఏటా మేనెలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దేవుని తీర్థంగా, దేవుని పెండ్లిగా గ్రామస్థులు పిలిచే ఈ వేడుక గ్రామస్తులకు ప్రధాన పండగ. పురాతన శివాలయం, అంజనేయ స్వామి గుడి గ్రామంలో కలవు. గ్రామ శివారులో నాగుల చెరువు వద్ద నాగులమ్మ గుడి కలదు. ప్రతి శివరాత్రికి అక్కడ ఉత్సవం నిర్వహిస్తారు. నాగుల చెరువు ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి శిల్పాలు శివలింగాలు చూడదగిన ప్రదేశాలు. గ్రామానికి పెట్టని కోటలా ఉన్న గుట్టలను జూలై నుండి జనవరి వరకు ఎంత చూసినా తనివితీరదు. గ్రామం ఈ చివర నుంఢి కోమటి గూడెం వెళ్లే రోడ్డు వరకు దాదాపు 7కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ గుట్టలకు ఏరియాను బట్టి పేర్లున్నాయి. సింగారపు ఏనె, చింతగట్టు, న్యాయమోల్ల గుట్టలు, ఆరెగండి అనే పేర్లతో పిలుస్తారు. ఇక గ్రామ శివారు గ్రామమైన రంగరాయ గూడెం సమీపంలోని రంగనాయకుల బండ కూడా చూడదగిన ప్రాంతమే. ఇక్కడ కాకతీయుల కాలంనాటి రంగనాయకుల స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి సమీపంలోనే ఏకశిలతోె సుమారు 20 అడుగుల ఎత్తైన దీప స్తంభం ఉంది. అయితే గ్రామంలోని పురాతన సంపదపై కన్ను వేసిన గుప్తనిధుల వేటగాల్లు పురాతన శిల్పాలను నాశనం చేస్తున్నారు. అయినా పురాతత్వ శాఖ వారు కానీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. నాగులమ్మ దేవాలయంలో దాదాపు ఒక ఫీట్ మందం కలిగిన బండను పగలగొట్టి ఆరు అడుగుల గొయ్యి తవ్వి సంపద దోచుకుపోయారు. రంగనాయకుల బండపైన గల దీప స్తంభాన్ని కూడా సగానికి విరగగొట్టి ఆ ముక్కను రెండుగా చీల్చారు. అద్భుతమైన ఏక శిల ద్వంసం అయినా ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. భాస్కర్ వడ్లకొండ.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/ఇప్పగూడెం" నుండి వెలికితీశారు