తూర్పు గాంగులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 70:
వీరి కుమారుడైన [[అనంతవర్మన్ చోడగాంగ]], గంగా - గోదావరి నదీముఖద్వారాల మధ్యనున్న ప్రదేశాన్నంతటినీ పరిపాలించి 11వ శతాబ్దంలో తూర్పు గాంగ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శైవునిగా పుట్టిన అనంతవర్మ, రామానుజాచార్యుని ప్రభావంతో వైష్ణవునిగా మారి పూరి వద్దనున్న జగన్నాధ ఆలయం నిర్మింపజేశాడు. చోళుల, గాంగుల వంశాన్ని సూచింపజేస్తూ చోడగాంగ అనే పేరుని ధరించినాడు. త్రికళింగాధిపతి బిరుదును మొదటిగా ధరించినది, అనంతవర్మే.
 
క్రీ.శ 1198లో రాజ్యానికి వచ్చిన రాజరాజు-3, క్రీ.శ 1206లో కళింగ పై సాగిన బెంగాల్ ముస్లింల దండయాత్ర నియంత్రించలేకపోయాడు. వీరి దండయాత్రని ని నిరోధించిన, అతని కుమారుడు అనంగభీమ -3, తన విజయానికి సంకేతంగా భవనేశ్వరం వద్ద మేఘేశ్వరాలయాన్ని నిర్మించాడు. అతని కుమారుడు నరసింహదేవ వర్మ-1, దక్షిణ బెంగాలుపై దండెత్తి వారి రాజధాని [[గౌర్]]ని ఆక్రమించాడు. ఆ విజయానికి గుర్తుగా కోణార్క్ వద్ద [[కోణార్క సూర్య దేవాలయం| సూర్యదేవాలయాన్ని]] నిర్మించాడు.
 
క్రీ.శ 1264 నరసింహదేవుని మరణం తర్వాత, తూర్పు గాంగుల శక్తి క్షీణించడం ఆరంభమైంది. క్రీ.శ 1324లో ఢిల్లీ సుల్తానులు, క్రీ.శ 1356లో విజయనగర ప్రభువులు కళింగ, ఓఢ్ర దేశాలపై దండెత్తి ఓడించారు. అయితే, చివరిపాలకుడైన నరసింహదేవ - 4 క్రీ.శ 1425లో మరణించేవరకు కళింగ-ఓఢ్ర ప్రాంతంపైన తూర్పు గాంగుల ఆధిపత్యం కొనసాగింది. క్రీ.శ 1434-35లో పిచ్చి రాజైన భానుదేవ-4 ని గద్దె దించి, మంత్రి అయిన ఓఢ్ర కపిలేంద్ర సింహాసనాన్ని అధిష్టించి, సూర్యవంశ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు గాంగులు మతానికి, కళలకి ప్రాధాన్యత ఇచ్చారు. వీరి కాలంనాటి ఆలయాలు భారతీయ శిల్పకళ యొక్క గొప్పదనాన్ని చాటుతూ ఉన్నాయి. <ref>[http://www.britannica.com/EBchecked/topic/225335/Ganga-dynasty Ganga dynasty (Indian dynasties) - Encyclopedia Britannica]. Britannica.com. Retrieved on 2013-07-12.</ref>
"https://te.wikipedia.org/wiki/తూర్పు_గాంగులు" నుండి వెలికితీశారు