తూర్పు గాంగులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
==భాష మరియు సాహిత్యం==
తెలుగువారైన తూర్పు గాంగులు, తమ రాజ్యంలోని అన్ని మతాలనీ, భాషలని సమానంగా చూసారు. వీరి రాజ్యంలో [[తెలుగు]], [[ఒరియా]], [[సంస్కృతం]], అపభ్రంశ భాషలను మాట్లాడే ప్రజలున్నారు. సంస్కృత భాష రాజభాషగా ఉండినది. అన్ని ప్రాంతాలలోనూ తెలుగు, సంస్కృత, ఒరియా శాసనాలు వేయించినారు. పరిపాలనాభాషగా ఒరియా భాషకి స్థానం కల్పించినది, తూర్పు గాంగులే. అయితే, తమ ఆస్థానాలలో తెలుగు, ఒరియా కవులను పోషించిన దాఖలాలు లేవు. <ref name ='EGanga1'>[http://odisha.gov.in/e-magazine/Orissareview/2012/April/engpdf/33-39.pdf]. odisha.gov.in. Retrieved on 2015-11-12.</ref>
 
రాజ్యవిస్తరణ అనంతరం కటకానికి రాజధాని మార్చినప్పటికీ స్థానికేతరులైన కారణంచేత, స్థానిక నాయకులకి అసంతృప్తి ఉండినట్టు పలువురు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగువారైనప్పటికి తూర్పు గాంగులు తమ రాజ్యాన్ని జాతులకి, భాషలకి అతీతంగా తమ రాజ్యాన్ని “పురుషోత్తమ సామ్రాజ్యం”గా పేర్కొన్నారు. కళింగ రాజ్యం లేదా ఓఢ్రరాజ్యం అని ఏ శాసనాలలోనూ పేర్కొనలేదు.<ref name ='EGanga1'/>
 
వీరి అనంతరం వచ్చిన సూర్యవంశ గజపతులు, భువనేశ్వర్-కటక్ లలో వేయించిన శాసనాలలో రాజధాని ప్రాంతాన్ని'స్వతంత్ర ఓఢ్ర దేశం'గా ప్రకటించుకున్నారు. అది స్థానిక అసంతృప్తి కారణంగానే అని పరిశోధకుల అభిప్రాయం.
"https://te.wikipedia.org/wiki/తూర్పు_గాంగులు" నుండి వెలికితీశారు