సిసింద్రీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

అఖిల్ సినిమా రివ్యూను తొలగించడం జరిగింది
పంక్తి 30:
 
[[వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు]]
 
 
ANDHRA BHOOMI REVIEW (13-11-2015) FRIDAY VENNELA REVIEW TWO STARS (**)
 
తారాగణం:
అఖిల్ అక్కినేని, సాయేషా సెహగల్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, వెనె్నల కిషోర్ తదితరులు
కథ, సంభాషణలు:
వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్
సంగీతం:
అనూప్‌రూబెన్స్, ఎస్‌ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ:
అమోల్ రాథోడ్
ఎడిటర్:
గౌతంరాజు
నిర్మాత:
నితిన్, సుధాకర్ రెడ్డి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
వివి వినాయక్
 
 
వయసుకు మించిన హైపు, అంచనాలు భుజాన వేసుకుని టాలీవుడ్ తెరంగ్రేట్రం చేశాడు -అఖిల్ అక్కినేని. వారసుల హీరోలే అయినా -టాలీవుడ్‌లో సహజంగా ఫస్ట్ అటెంప్ట్‌లో లవర్‌బోయ్ వేషాలేయడం సర్వసాధారణం. కానీ లేట్, లేటెస్ట్ కానె్సప్ట్‌తో కమర్షియల్ హీరో పాపులార్టీ కోసం -అఖిల్ సాహసాలే చేశాడు. దర్శకుడిగా మాస్ పల్స్ తెలిసిన వివి వినాయక్/ బెస్ట్ ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్ నితిన్/ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు/ రైటర్‌గా కొమ్ములు తిరిగిన కోన/ అపారమైన అనుభవమున్న సాంకేతిక వర్గం.. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు మందీ మార్భలంతో ఫస్ట్ సినిమాకే హైప్ సెటప్ కుదుర్చుకున్నాడు. కమర్షియల్ కాంబొ ప్యాక్‌ను చూసి అఖిల్ చెలరేగిపోవడం ఖాయమని -ఎవరికి వాళ్లే లెక్కలు వేసేసుకున్నారు.
 
 
 
కథ:
సూర్యగ్రహణ కిరణాలు భూమికి ఎప్పటికైనా చేటేనని గ్రహించి ఆ వినాశనం నుంచి భూమిని తప్పించడానికి -కొన్ని వందల ఏళ్ల క్రితం రుషులు, మహర్షులు ఒక లోహగోళాన్ని తయారు చేశారంటూ కథ ఆరంభమవుతుంది. భూమిని రక్షించే ఆ ‘జువా’ లోహగోళాన్ని పరిరక్షించే బాధ్యతను ఆఫ్రికన్ తెగ తీసుకుందంటూ కథ మొదలయ్యేసరికి -రొటీన్ తెలుగు సినిమాకు భిన్నంగా హాలీవుడ్ డోస్‌ను అనుభవంలోకి తెచ్చే సోషియో ఫాంటసీ ఊహల్లోకి వెళ్లిపోయారు ప్రేక్షకులు. కానీ, కాగితాల మీద లైన్ ఆర్ట్ చూపించినంత గొప్పగా కథలో లైన్ లేదన్న విషయం ఐదారు రీళ్లు నడిచే సరికే అర్థమైపోయింది.
విలయమూ, విజయమూ తన చేతిలోనే ఉండాలన్న అత్యాశాపరడైన రష్యన్ విలన్ ఖత్రోచీ చేసే కుటిల యత్నాలు, విలన్ చేతికి జువా దక్కకుండా హీరో అఖిల్ చేసే వీరోచిత ఫైటింగ్‌లు.. మధ్యమధ్యలో కొద్దిగా ప్రేమ, చేజింగ్ కాల్పులు, నవ్వుపండని కామెడీని దట్టిస్తూ -చివరిగా దుష్టసంహారం చేయడమే సినిమా సారాంశం. అంతుచిక్కని కథ, అయోమయం కథనంతో సినిమా పూరె్తైపోయింది. ‘జువా’ అన్న రెండక్షరాల లోహపు సూర్యగోళం గురించి వాయిస్ ఓవర్‌తోనే ఓవర్‌త్రో చేశారు. మిగిలిన సినిమా మొత్తం పేలవమైన సన్నివేశాలు, బిగింపులేని కథనంతో అలాఅలా సాగిపోయింది.
 
 
 
అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి మెతుకు పట్టుకుని చూస్తే చాలు. సినిమా పండిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క సన్నివేశాన్ని చూస్తే చాలు.
ఎలా సాధ్యం? అన్న లాజిక్‌ను లక్షసార్లు ప్రశ్నించుకోవడానికి వీలుగా సినిమాలో ఓ సన్నివేశముంది. హీరోయిన్ (సాయేషా సెహగల్) పెంపుడు కుందేలుకి అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. హీరోయిన్‌తో పరిచయం కోసం అబద్ధం చెప్పి ఆపరేషన్ ఎడిసోడ్‌లో ఇరుక్కుంటాడు చదువూ సంధ్యాలేని హీరో అఖిల్. దానికోసం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ (రాజేంద్రప్రసాద్) సాయం తీసుకుంటారు. ఇంట్లో కూర్చుని మెడికల్ జర్నల్స్ తిరగేస్తూ ఆపరేషన్ ఎలా చేయాలో బ్లూటూత్ ద్వారా రాజేంద్రప్రసాద్ చెప్తుంటే, దాన్ని వింటూ.. తనకు తెలుసన్న బిల్డప్‌తో ఫ్రెష్ మెడికో స్టూడెంటైన హీరోయిన్‌తో కుందేలుకి సర్జరీ చేయిస్తాడు హీరో. కుందేలు బతుకుతుంది. సీన్ చూసిన వాళ్లుమాత్రం కళ్లు తేలేశారు. ఈ ఒక్కసీన్‌తో ‘అఖిల్’ ఉడికిందో లేదో అర్థమైపోతుంది ఆడియన్స్‌కి. ఇలాంటి లెక్కకుమించి సన్నివేశాలతో చప్పగా సాగిపోతున్న సినిమాలో -అఖిల్ పాటేసుకున్నప్పుడల్లా మాత్రం ఆడియన్స్ కొంచెం తేరుకున్నారు. మైఖేల్ జాక్సన్, జస్టిన్ బైబర్‌లాంటి పాప్‌సింగర్స్ స్టెప్పుల్ని ఎక్కువగా అనుకరించినా -అఖిల్ డాన్సింగ్ స్కిల్స్‌లో పర్‌ఫెక్షన్‌తో మరో పాట కోసం ఎదురుచూసేలా కూర్చోబెట్టగలిగాడు. కాకపోతే -ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్, టైమింగ్ డిక్షన్ విషయంలో అఖిల్ మరింత కేర్ తీసుకోవాల్సింది.
 
 
 
అఖిల్ సినిమా కథనం మాటెలావున్నా -పాత్రల నుంచి పిండుకోవాల్సిన పెర్ఫార్మెన్స్ విషయంలోనూ దర్శకుడు వినాయక్ ఫెయిల్యూర్ పర్ఫెక్ట్‌గా కనిపించింది. కమర్షియల్ ఫార్మాట్ (ఎంటర్‌టైన్‌మెంట్- లవ్- టైంపాస్ సీక్వెన్స్- ఇంటర్వెల్ కాన్ఫ్లిక్ట్- హీరోయిక్ సొల్యూషన్ -టెరిఫిక్ క్లైమాక్స్) వినాయ్‌కు కొట్టినపిండే అయినా -అఖిల్‌ను అప్పీలింగ్‌గా చెప్పడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఫ్యాన్స్‌కు పూనకం తెప్పించే హీరోయిజం ఎలివేషన్లు, కడుపుబ్బ నవ్వించే కామెడీ సీన్లు, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ క్లైమాక్స్‌లాంటి వినాయక్ మార్క్ ఒక్కటీ సినిమాలో కనిపించలేదు. రెండుగంటలు దాటేసిన ‘్భరీ’ చిత్రంలో కళ్లప్పగించి చూడ్డానికి అఖిల్ డ్యాన్స్‌లు తప్ప, గుండెకు హత్తుకునే సన్నివేశం ఒక్కటీ లేకపోయింది. అదిరిపోయే పాటలు, మూడ్ తెప్పించే లొకేషన్లు, బిగ్ టెక్నికల్ టీం, అంతకుమించి అఖిల్.. -ప్రాజెక్టులో ఇన్ని వనరులున్నా ఎయిమ్‌లెస్ డైరెక్షన్‌తో కష్టం వృధా అయిపోయింది. ఫస్ట్ఫాలో సాంగ్స్, ఫైట్స్‌తో లాగేశారు. సెకెండాఫ్‌లో స్పాన్ ఉన్న కథ పెట్టుకుని కూడా -ఎటో తీసుకెళ్లిపోయారు. స్పీడ్‌లేని సన్నివేశాలతో సినిమా నీరసంగా నడవటంతో -అఖిల్ కష్టమంతా ఆవిరైపోయంది. బలహీనమైన సన్నివేశాలకు ఎంత గ్రాఫిక్ మాయాజాలాన్ని జోడించినా ఫలితం లేకుండాపోయింది. సినిమాకు దర్శకుడు వినాయక్ అన్న విషయం క్లైమాక్స్‌లోనూ గుర్తుకురాకుండా పోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొద్దిగా కష్టపడితే కమర్షియల్ హీరోగా నిలబడే సత్తా అఖిల్‌కుందన్న విషయాన్ని చెప్పుకోవడానికి తప్ప -‘అఖిల్’ సినిమాలో ఆశించినంత సరుకు లేదు. డైరెక్టర్ వివి వినాయక్ డబుల్ బారెల్ యాక్షన్ రైఫిల్ మిస్ ఫైర్ అయ్యింది.
"https://te.wikipedia.org/wiki/సిసింద్రీ_(సినిమా)" నుండి వెలికితీశారు