బొబ్బిలి బ్రహ్మన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
వెంకటేశ్వరరావు తెలుగు అధ్యాపకుడిగా పనిచేసిన సోదరుడు గోపాలకృష్ణను పురాణాల్లోని తీర్పుకు సంబంధించిన సంఘటన కోసం అడగితే ఆయన సుకన్యోపాఖ్యానాన్ని కొద్ది మార్పుతో చెప్పారు. ఆ మార్పుచోటుచేసుకున్న కథ ప్రకారం సంయాతి మహారాజు కుమార్తె సుకన్య అడవిలోని పుట్టలో రంధ్రాల గుండా వెలుగు వస్తూంటే ఏదో పాము మణి నుంచి వస్తోందనుకుని సైనికుల నుంచి రెండు కత్తులు తీసుకుని పుట్టలో పొడుస్తుంది. నిజానికి ఆ తేజస్సు చ్యవన మహర్షి తపస్సు వల్ల వెలువడ్డ తేజస్సు, దాంతో ఆ పొడిచిన కత్తులు నేరుగా చ్యవన మహర్షి కళ్ళకు తగిలి కన్నులు పోతాయి. చ్యవన మహర్షి శాపం వల్ల సైనికులు బాధపడుతూండడంతో కూతురు ద్వారా నిజం తెలుసుకున్న రాజు చ్యవనుడి వద్దకు వెళ్ళి క్షమించమని కోరుతాడు. మరి నీ కూతురు వల్ల అంధుణ్ణయ్యాను నాకు న్యాయమేంటని మహర్షి అడిగితే, నా కూతురు వల్ల మీ చూపు పోయింది కనుక మీకు భార్యయై దారిచూపుతుందని తీర్పునిస్తాడు రాజు.<br />
సుకన్యోపాఖ్యానంలోని ఈ పాఠాంతరీకరణ నచ్చడంతో రాఘవేంద్రరావును మరో రోజు గడువు అడిగాడు. అప్పుడు రాసిన కథ ప్రకారం బ్రహ్మన్న కుమార్తె ఉయ్యాల ఊగుతూ రాజవర్మ అనే వ్యక్తి మీద పడి అతని కళ్ళుపోవడం, కళ్ళు తన కూతురి వల్లే పోయాయి కనుక ఆమెను అతనికి ఇచ్చి వివాహం చేసేట్టు బ్రహ్మన్న తీర్పునివ్వడం, ఈ తీర్పును వ్యతిరేకిస్తూ తమ్ముడు ఆమెను తాను ప్రేమించిన వ్యక్తికిచ్చి పెళ్ళిచేయడం, తద్వారా కూతురునీ, తమ్ముడిని ఊరి నుంచి బహిష్కరించడం వంటి సన్నివేశాలు ఉంటాయి. ఈ వెర్షన్ నచ్చడంతో రాఘవేంద్రరావు సినిమా కథ అంగీకరించారు.<ref name="లెవంత్ అవర్">{{cite book|last1=పరుచూరి|first1=గోపాలకృష్ణ|authorlink1=పరుచూరి గోపాలకృష్ణ|title=లెవంత్ అవర్|date=డిసెంబర్ 2008|publisher=వి టెక్ పబ్లికేషన్స్|location=హైదరాబాద్|pages=24 - 33|edition=2|accessdate=17 November 2015|language=తెలుగు|chapter=బొబ్బిలి బ్రహ్మన్న}}</ref>
 
=== చిత్రీకరణ ===
బొబ్బిలి బ్రహ్మన్న సినిమా చిత్రీకరణ ప్రధానంగా గోదావరి నదీ పరిసర ప్రాంతాల్లో జరిగింది.<ref name="సాక్షిలో కృష్ణంరాజు ఇంటర్వ్యూ">{{cite news|last1=సాక్షి|first1=విలేకరి|title=ప్రభాస్ పుష్కరాలకి వస్తాడో రాడో...|url=http://www.sakshi.com/news/district/krishnam-raju-interview-with-sakshi-255665|accessdate=17 November 2015|work=సాక్షి|date=9 జూలై 2015}}</ref>
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_బ్రహ్మన్న" నుండి వెలికితీశారు