బొబ్బిలి బ్రహ్మన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
== కథ ==
రామనాథం అనే బ్రాహ్మణుడు చాలామంది బ్రాహ్మణులు తరుముతూండగా ప్రాణభయంతో పారిపోయి కోటిపల్లి అనే ఊళ్ళోకి వెళ్తారు. అది బ్రహ్మన్న గారి ఊరు అంటూ వారందరూ పొలిమేరల్లోనే ఆగిపోతారు. రామనాధం మార్కండేయశాస్త్రి అనే కోటిపల్లి గ్రామ పూజారి ఆశ్రయం తీసుకుంటారు. గ్రామంలోకి అప్పటివరకూ పోలీసులు అడుగుపెట్టింది లేదు. కొత్త ఎస్సై నేరస్తుడైన రామనాథం కోసం కోటిపల్లికి రాబోతూండగా పొలిమేరల వద్ద బ్రహ్మన్న అడ్డుకుంటారు. నేరస్తుడు మీ ఊళ్ళోకి వచ్చారని ఎస్సై అంటే బ్రహ్మన్న అతను నేరస్తుడో కాదో నేను తేలుస్తాను, తీర్పు వినడానికి మీరు సాధారణ పౌరునిగా రండి అని పిలుస్తారు. తర్వాతి రోజు సామాన్యపౌరునిగా వచ్చిన ఎస్సైకి కస్తూరి(జయసుధ), స్వరాజ్యం ధర్మపీఠం గొప్పదనం, బ్రహ్మన్న వంశస్తులు స్వరాజ్యం కోసం చేసిన పోరాటం వంటివి బుర్రకథగా చెప్తారు. ధర్మపీఠం దగ్గర బ్రహ్మన్న పొరుగూరి బ్రాహ్మణలు రామనాథంపై తెచ్చిన ఫిర్యాదుని పరిశీలిస్తారు. బ్రాహ్మణుడిగా పుట్టి తిండికి గతిలేని స్థితిలో మాంసం కొట్టు పెట్టుకున్న రామనాథానిది తప్పు కాదని ధర్మశాస్త్రాల ప్రమాణంగా తీర్పునిస్తాడు బ్రహ్మన్న. అయితే పొరుగూరి నుంచి వచ్చిన వ్యక్తికి నేరస్తుడో కాదో నిర్ధారణగా తెలుసుకోకుండా ఆశ్రయమిచ్చినందుకు శాస్త్రిని ఆలయ పూజకు దూరంచేస్తూ శిక్ష విధిస్తారు. బ్రహ్మన్న తీర్పును సామాన్య పౌరుని హోదాలో విన్న ఎస్సై ఆయనను కలిసి అభినందిస్తారు.<br />
గ్రామంలోని మీసాల పెద వెంకటరాయుడు, క్షురకుడు ముత్యాలు, రాయుడి కొడుకు బుల్లబ్బాయి వంటివారు బ్రహ్మన్నకు వ్యతిరేకులుగా ఉంటూ, అక్రమాలు, తప్పుడు పనులు చేస్తూంటారు. పొలంలో పనిచేస్తున్న తండ్రికి భోజనం ఇద్దామని కస్తూరి వెళ్ళబోగా దారిలో అడ్డగించి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగడతాడు బుల్లబ్బాయి. బుల్లబ్బాయిని అడ్డుకుని బ్రహ్మన్న తమ్ముడు రవి కొడతాడు. ఈ విషయంపై అటు బుల్లబ్బాయిని రాయుడు, ఇటు రవిని బ్రహ్మన్న తిడతారు.
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_బ్రహ్మన్న" నుండి వెలికితీశారు