బొబ్బిలి బ్రహ్మన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
రామనాథం అనే బ్రాహ్మణుడు చాలామంది బ్రాహ్మణులు తరుముతూండగా ప్రాణభయంతో పారిపోయి కోటిపల్లి అనే ఊళ్ళోకి వెళ్తారు. అది బ్రహ్మన్న గారి ఊరు అంటూ వారందరూ పొలిమేరల్లోనే ఆగిపోతారు. రామనాధం మార్కండేయశాస్త్రి అనే కోటిపల్లి గ్రామ పూజారి ఆశ్రయం తీసుకుంటారు. గ్రామంలోకి అప్పటివరకూ పోలీసులు అడుగుపెట్టింది లేదు. కొత్త ఎస్సై నేరస్తుడైన రామనాథం కోసం కోటిపల్లికి రాబోతూండగా పొలిమేరల వద్ద బ్రహ్మన్న అడ్డుకుంటారు. నేరస్తుడు మీ ఊళ్ళోకి వచ్చారని ఎస్సై అంటే బ్రహ్మన్న అతను నేరస్తుడో కాదో నేను తేలుస్తాను, తీర్పు వినడానికి మీరు సాధారణ పౌరునిగా రండి అని పిలుస్తారు. తర్వాతి రోజు సామాన్యపౌరునిగా వచ్చిన ఎస్సైకి కస్తూరి(జయసుధ), స్వరాజ్యం ధర్మపీఠం గొప్పదనం, బ్రహ్మన్న వంశస్తులు స్వరాజ్యం కోసం చేసిన పోరాటం వంటివి బుర్రకథగా చెప్తారు. ధర్మపీఠం దగ్గర బ్రహ్మన్న పొరుగూరి బ్రాహ్మణలు రామనాథంపై తెచ్చిన ఫిర్యాదుని పరిశీలిస్తారు. బ్రాహ్మణుడిగా పుట్టి తిండికి గతిలేని స్థితిలో మాంసం కొట్టు పెట్టుకున్న రామనాథానిది తప్పు కాదని ధర్మశాస్త్రాల ప్రమాణంగా తీర్పునిస్తాడు బ్రహ్మన్న. అయితే పొరుగూరి నుంచి వచ్చిన వ్యక్తికి నేరస్తుడో కాదో నిర్ధారణగా తెలుసుకోకుండా ఆశ్రయమిచ్చినందుకు శాస్త్రిని ఆలయ పూజకు దూరంచేస్తూ శిక్ష విధిస్తారు. బ్రహ్మన్న తీర్పును సామాన్య పౌరుని హోదాలో విన్న ఎస్సై ఆయనను కలిసి అభినందిస్తారు.<br />
గ్రామంలోని మీసాల పెద వెంకటరాయుడు, క్షురకుడు ముత్యాలు, రాయుడి కొడుకు బుల్లబ్బాయి వంటివారు బ్రహ్మన్నకు వ్యతిరేకులుగా ఉంటూ, అక్రమాలు, తప్పుడు పనులు చేస్తూంటారు. పొలంలో పనిచేస్తున్న తండ్రికి భోజనం ఇద్దామని కస్తూరి వెళ్ళబోగా దారిలో అడ్డగించి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగడతాడు బుల్లబ్బాయి. బుల్లబ్బాయిని అడ్డుకుని బ్రహ్మన్న తమ్ముడు రవి కొడతాడు. ఈ విషయంపై అటు బుల్లబ్బాయిని రాయుడు, ఇటు రవిని బ్రహ్మన్న తిడతారు. రవి కస్తూరి ప్రేమించుకుంటూంటారు, రాంబాబు, బ్రహ్మన్న కుమార్తె రాజేశ్వరి ప్రేమించుకుంటారు.<br />
గ్రామంలోని వంద మంది చేనేత కార్మికుల పేరు మీద రాయుడు లోన్లు తీసుకున్నాడని రవి కనిపెట్టడంతో కస్తూరి, స్వరాజం, ఇతర చేనేత కార్మికులు రాయుడు ఇంటిముందు నిరసన వ్యక్తం చేస్తారు. రాయుడు బుకాయించబోగా రవి అతని నిజస్వరూపం బయటపెడతాడు. రవి సహకారంతో కస్తూరి, స్వరాజ్యం కుటీర పరిశ్రమ ఏర్పాటుచేసుకుని దాన్ని బ్రహ్మన్న చేతులమీదుగా ప్రారంభింపజేస్తారు.<br />
బుల్లెబ్బాయి స్వరాజ్యాన్ని మాయచేసి శ్మశానం దగ్గరకి రప్పించి అత్యాచారం చేయబోగా ఆమెకు గొంతు పోతుంది. రవి బుల్లబ్బాయిని తీసుకువస్తే, నేనే వాణ్ణి ధర్మపీఠం దగ్గరకు తీసుకువస్తానని రాయుడు తీసుకువెళ్తాడు. సాక్ష్యాల్ని విచారించిన బ్రహ్మన్న బుల్లబ్బాయి స్వరాజ్యాన్ని పెళ్ళాడాలని, లేని పక్షంలో రాయుడు కుటుంబం ఊరు విడిచి పోవాలని తీర్పు ఇస్తాడు.
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_బ్రహ్మన్న" నుండి వెలికితీశారు