"చిర్రావూరి లక్ష్మీనరసయ్య" కూర్పుల మధ్య తేడాలు

ఈయన ఆదర్శప్రాయుడైన చైర్మన్‌ అవడంతో మారుమూల ప్రాంతాల్లోనూ పేదలు నివసించే చోట్ల కూడా నీరు, విద్యుత్‌ సౌకర్యం లభించింది.
 
ఖమ్మం జిల్లాలో 1962లో చైనా సరిహద్దు వివాదంకాలంలో అరెస్టుల అనంతరం జైలు నుంచి బయటకురాగానే సిపిఐ(ఎం) నిర్మాణానికి సన్నాహాలు మొదలుపెట్టింది అప్పటి నాయకత్వం. గిరిప్రసాద్‌ 1964 ఏప్రిల్‌లో తనికెళ్ళలో జరిగిన జిల్లా పార్టీ మహాసభ, అనంతరం కొక్కిరేణి మహాసభలో సిపిఐ విధానంతో మరింత బాహాటంగా ముందుకొచ్చారు. చివరకు మైనార్టీలోపడి ఆయన నాయకత్వం నుంచి వైదొలిగారు. ఆ కీలకమైన సమయంలో పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన చిర్రావూరి 18 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా ఆ బాధ్యతలు నిర్వహించారు. చిర్రావూరి నాయకత్వంలో పోరాట యోధులైన మంచికంటి రాంకిషన్‌ రావు, [[పర్సా సత్యనారాయణ]], [[బోడేపూడి వెంకటేశ్వరరావు]], రావెళ్ళ సత్యనారాయణ, బోజడ్ల వెంకటనారాయణ, చింతలపూడి జగ్గయ్య, [[కె.ఎల్.నరసింహారావు]], రాయల వీరయ్య, ఏలూరి లక్ష్మీనారాయణ, టివిఆర్‌ చంద్రం, బండారు చంద్రరావు తదితరులు జిల్లాలో ఉద్యమాన్ని ముందుకుతీసుకుపోవడంలో అద్వితీయ పాత్ర నిర్వహించారు.
 
సిపిఐ(ఎం) జిల్లా కమిటీ 25 మందితో ఏర్పడింది. 1964లో ఖమ్మం జిల్లాలో మెజారిటీ పార్టీ సిపిఐ(ఎం) వైపే నిలబడింది. కార్యక్రమాలలోనూ, ఎన్నికల్లోనూ సిపిఐ(ఎం) ఆధిక్యత స్పష్టంగా వెల్లడైంది. తర్వాత ప్రత్యేక తెలంగాణ వాదం, 70వ దశకంలో రజబ్‌అలీ విచ్ఛిన్నం, అనంతరం ఎమర్జెన్సీ నిర్బంధం, నక్సలైట్ల నరమేధం, వీటన్నిటినీ ఖమ్మం జిల్లా ఉద్యమం ఎదుర్కొన్నది. తమ్మినేని సుబ్బయ్యపై తీవ్రదాడి జరిగినపుడు దానికి వ్యతిరేకంగా ఖమ్మంలో నిరసన ప్రదర్శన జరపాలని నిర్ణయించారు. అలాంటి సమయంలో రజబ్‌అలీ దాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులను జిల్లా కార్యదర్శి బాధ్యతల్లో చిర్రావూరి ఎదుర్కొన్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1774988" నుండి వెలికితీశారు