బోడేపూడి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
చదువులో ముందుండి చదువుకోడానికి స్తోమతలేని పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగకంరగా ప్రజా నాయకుడు బోడేపూడి పేరుమీద ఏర్పాటుచేయబడిందే ఈ బోడేపూడి విజ్ఞానకేంద్రం. బోడేపూడి దీనిని [[జూన్ 27]], [[2007]] లో 55 మంది విద్యార్థులతో ప్రారంభించారు. ఆరోజు నుండి ఎంతోమంది విద్యార్థులు ఇందులో విద్యను అభ్యసించారు. 10 మంది విశ్రాంత ఉపాధ్యాయులు ఈ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్నారు.
 
దీనిలో గ్రంథాలయం కూడా ఉంది. అందులో 25వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. పేద విద్యార్థులకు ఉచిత వైద్యంకోసం ప్రేమ్‌ చంద్‌ ప్రజా వైద్యశాల కూడా నడుపబడుతుంది. ప్రతి ఆదివారం మీకోసం అనే కార్యక్రమం ద్వారా అనేక విజ్ఞాన, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా శాస్త్రీయ, జానపద తదితర విభాగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు రేపటి పౌరులుగా ఎదిగి సమాజంలోని అసమానతలను తొలగించడానికి వారి వంతు కృషి చేయడమే బోడేపూడి విజ్ఞాన కేంద్రం లక్ష్యం.
 
==మూలాలు==