బొబ్బిలి బ్రహ్మన్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
producer = [[ఉప్పలపాటి సూర్యనారాయణరాజు]]
}}
బొబ్బిలి బ్రహ్మన్న [[ఉప్పలపాటి కృష్ణంరాజు|కృష్ణంరాజు]], [[జయసుధ]], [[రావు గోపాలరావు]] ప్రధాన పాత్రధారులుగా [[గోపీకృష్ణా కంబైన్స్|గోపీకృష్ణా మూవీ క్రియేషన్స్]] పతాకంపై [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో నిర్మించిన 1984 నాటి తెలుగు చలన చిత్రం. ఈ చిత్రానికి కథ, మాటలు [[పరుచూరి బ్రదర్స్|పరుచూరి సోదరులు]] అందించారు. బ్రిటీష్ కాలంలోని కథగా టైటిల్స్ లో చూపించిన ఈ సినిమా బొబ్బిలి ప్రాంతంలోని కోటిపల్లి అనే గ్రామంలో ప్రారంభమవుతుంది. గ్రామంలోని ఏ నేరానికైనా స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన బొబ్బిలి వంశీకుడు బ్రహ్మన్న విచారించి తీర్పు చెప్తూంటారు.
== కథ ==
రామనాథం అనే బ్రాహ్మణుడు చాలామంది బ్రాహ్మణులు తరుముతూండగా ప్రాణభయంతో పారిపోయి కోటిపల్లి అనే ఊళ్ళోకి వెళ్తారు. అది బ్రహ్మన్న గారి ఊరు అంటూ వారందరూ పొలిమేరల్లోనే ఆగిపోతారు. రామనాధం మార్కండేయశాస్త్రి అనే కోటిపల్లి గ్రామ పూజారి ఆశ్రయం తీసుకుంటారు. గ్రామంలోకి అప్పటివరకూ పోలీసులు అడుగుపెట్టింది లేదు. కొత్త ఎస్సై నేరస్తుడైన రామనాథం కోసం కోటిపల్లికి రాబోతూండగా పొలిమేరల వద్ద బ్రహ్మన్న అడ్డుకుని అతను నేరస్తుడో కాదో నేను తేలుస్తాను, తీర్పు వినడానికి మీరు సాధారణ పౌరునిగా రండి అని పిలుస్తారు. తర్వాతి రోజు సామాన్యపౌరునిగా వచ్చిన ఎస్సైకి కస్తూరి(జయసుధ), స్వరాజ్యం ధర్మపీఠం గొప్పదనం, బ్రహ్మన్న వంశస్తులు స్వరాజ్యం కోసం చేసిన పోరాటం వంటివి బుర్రకథగా చెప్తారు. ధర్మపీఠం దగ్గర బ్రహ్మన్న బ్రాహ్మణుడిగా పుట్టి తిండికి గతిలేని స్థితిలో మాంసం కొట్టు పెట్టుకున్న రామనాథానిది తప్పు కాదని ధర్మశాస్త్రాల ప్రమాణంగా తీర్పునిస్తాడు బ్రహ్మన్న. అయితే పొరుగూరి నుంచి వచ్చిన వ్యక్తికి నేరస్తుడో కాదో నిర్ధారణగా తెలుసుకోకుండా ఆశ్రయమిచ్చినందుకు శాస్త్రిని ఆలయ పూజకు దూరంచేస్తూ శిక్ష విధిస్తారు. బ్రహ్మన్న తీర్పును సామాన్య పౌరుని హోదాలో విన్న ఎస్సై ఆయనను కలిసి అభినందిస్తారు.<br />
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_బ్రహ్మన్న" నుండి వెలికితీశారు