శంకరమంచి పార్థసారధి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==కథకునిగా==
1978 శంకరమంచి మొదటి కథ స్వాతిలో ప్రచురితమయ్యింది. ఇప్పటి వరకూ దాదాపు 200 లకి పైగా కథలు స్వాతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, చతుర, ఉదయం వంటి అన్ని వార మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. [[ఆంధ్రజ్యోతి]], [[స్వాతి]], [[ఉదయం]] పత్రికల్లో కథలకు బహుమతులు అందుకున్నారు. శంకరమంచి తన కథల్లో కుటుంబ జీవనంలోని విలువలకు, స్త్రీ సమస్యలకు ప్రాధాన్యమిచ్చారు. అనాది నుండి ఆధునిక కాలం వరకూ స్త్రీ ఎదుర్కొంటున్న వివక్ష, పడుతున్న బాధలు వీరి రచనల్లో చర్చకి వస్తాయి. నేటిప్రపంచం ఇంతటి ప్రగతి సాధించినా మహిళల కష్టాలు తగ్గకపోగా మరింత పెరగడం ఆయన్ని బాధిస్తోంటుంది. స్త్రీ అంటే ఎంతో గౌరవం శంకరమంచికి. ఈ విషయం ఆయన రచనల్లో ప్రతిబింబిస్తూంటుంది.<ref>[http://sankaramanchi.in/katalu.html కథకునిగా శంకరమంచి పార్థసారథి]</ref>
 
==నాటకాలు==
బిక్కు, దీక్షిత్ వంటి నాటకరంగ మిత్రుల ప్రోత్సాహంతో "చికాగో" అనే హాస్యనాటిక రాసారు. హళ్ళికి హళ్ళిలో పూర్తి వైవిధ్యాన్ని అందించారు శంకరమంచి. ఈ నాటిక అనేక పరిషత్ పోటీలలో గెలుపొందింది. అనేక వేదికలపై విజయవంతంగా ప్రదర్శితమవుతూ వస్తోంది.