శ్రీశైల క్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎[[హటకేశ్వరం]]: clean up, replaced: మల్లిఖార్జున → మల్లికార్జున using AWB
పంక్తి 17:
శ్రీశైలం చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిది క్రీ.శ.6వ శతాబ్ది నాటిది. ఆరవ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం పేరు కనిపిస్తోంది.
=== సాహిత్యాధారాలు ===
[[తెలుగు]], [[తమిళ]], [[కన్నడ]] గ్రంథాల్లో దీని ప్రశంస విస్తారంగా కనిపిస్తోంది. క్రీ.శ.6, 7 శాతాబ్దాల నాటి తమిళ శైవ గ్రంతం తేవరంలో అస్పర్, సుందర్, నమ్మందర్ అనే పేర్లున్న భక్తకవులు శ్రీశైలాన్ని గురించి గానం చేశారు. తిరుప్పాపురం (శ్రీపర్వతం) అని పేర్కొన్నారు. క్రీ.శ.14వ శతాబ్దం నాటి శైవకవియైన [[పాల్కురికి సోమనాథుడు]] తన [[పండితారాధ్య చరిత్రము]]లో ''కరమొప్పు దక్షిణ కైలాసము'' అంటూ శ్రీశైలాన్ని కీర్తించారు.<ref name="చారిత్రిక శ్రీశైలం" /> తెలుగు సాహిత్యంలో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన [[కాశీయాత్ర చరిత్ర]]లో శ్రీశైలం 1830ల నాడు ఎలా ఉందన్న వివరాలు దొరుకుతున్నాయి. 1830లో [[చెన్నపట్టణం]] నుంచి కాశీకి యాత్రగా వెళ్ళిన గ్రంథకర్త [[ఏనుగుల వీరాస్వామయ్య]] ఆ ఏడాది జూన్ 16 నాటికి శ్రీశైలం చేరుకున్నారు. ఆయన వ్రాసిన దాని ప్రకారం 1830ల్లో ఈ ప్రాంతం కందనూరు నవాబు అధీనంలో ఉండేది. శ్రీశైలం కొండమీద వాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడమూ, క్రూరమృగాల భీతి ఉండడంతో ఈ ఆలయాల అర్చకులు, కందనూరు నవాబు తరఫున యాత్రికుల నుంచి హాశ్శీలు తీసుకునే ముసద్దీలు [[ఆత్మకూరు, కర్నూలు జిల్లా|ఆత్మకూరు]] పట్టణంలో కాపురం ఉండేవారు. ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికీ రూ.7, గుర్రానికి రూ.5, అభిషేకానికి రూ.3, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక రూ.43, దర్పణసేవోత్సవానికి రూ.3 ప్రకారం నవాబుకు చెల్లించాల్సివచ్చేది. శ్రీశైలానికి వెళ్ళే నాలుగు బాటల్లో ఆత్మకూరు బాట తప్ప మిగిలిన దారులు ఉత్సవాలు కాని సామాన్యమైన రోజుల్లో వెళ్లేందుకు వీలే లేని స్థితిలో ఉండేవి. చెంచువాళ్ళ భయం, అడవి జంతువుల భయం విస్తరించివుండేది. చెంచువాళ్ళు ఆటవికులైనా అప్పట్లో చాలామంది దారినపోయే యాత్రికులను యాచించి తినే అలవాటు పడ్డారని వ్రాసుకున్నారు. ప్రతిరోజూ పల్లకీసేవ జరిగేది. చైత్రమాసంలో భ్రమరాంబ అమ్మవారికి తామసపూజలు జరిగేవి. అర్చకులు ఒకరొకరు మార్చి మార్చి డ్యూటీలు చేసుకునేవారని వుంది.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
 
== స్థల పురాణం ==
"https://te.wikipedia.org/wiki/శ్రీశైల_క్షేత్రం" నుండి వెలికితీశారు