ఎర్రకోట: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి (3) using AWB
పంక్తి 23:
[[File:Delhi gate (Red Fort).jpg|thumb|ప్రాంతములో ఎర్రకోట యొక్క ఢిల్లీ గేట్]]
[[File:Red Fort 65771487 0479aebecc o.jpg|thumb|సిపాయిల తిరుగుబాటు అనంతరం, ఆక్రమిస్తున్న బ్రిటిష్ వాళ్ళు అనేక ముఘల్ కట్టడాలని పగలకొట్టి, వాళ్ళ యొక్క శిబిరాలని నిర్మించుకున్నారు]]
మొఘల్ చక్రవర్తి [[షాజహాను]], ఈ బ్రహ్మాండమైన కోట నిర్మాణాన్ని 1638 సంవత్సరములో ప్రారంభించగా, 1648 సంవత్సరములో నిర్మాణం పూర్తి అయింది.
ఎర్రకోట, మొదట్లో ఖిలా-ఇ-ముబారక్ (దీవించబడ్డ కోట)అని సంబోధించబడేది. ఎందుకంటే అది అప్పట్లో రాజుల కుటుంబానికి నివాస స్థలముగా ఉండేది. ఎర్రకోట యొక్క నిర్మాణ ప్రణాళిక, సలిమ్గార్ కోటతో అనుసంధానంగా ఉండే విధముగా రూపొందించబడింది. ఈ రాజభావన కోట, పురాతనమైన షాజహానాబాద్ నగరానికి ఒక ముఖ్యమైన కేంద్రముగా ఉండేది. ఎర్రకోట యొక్క నిర్మాణ ప్రణాళిక, అందము మరియు అలంకారము షాజహాన్ చక్రవర్తి పాలనలోని అధ్బుత మొఘల్ సృజనాత్మకతకు అద్దం పట్టింది. షాజహాన్ చక్రవర్తి నిర్మించిన తరువాత ఎర్రకోటలో అనేక కొత్త నిర్మాణాలు చేయబడ్డాయి. వీటిలో ముఖ్యమైన నిర్మాణ దశలు, ఔరంగజేబు తదితర మొఘల్ పాలకులు కాలంలో జరిగాయి. బ్రిటిష్ పాలన సమయములో 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర యుద్ధం తరువాత, ఎర్ర కోట స్థలములో ముఖ్యమైన భౌతిక మార్పులు జరిగాయి. స్వాతంత్రం తరువాత, ఎర్రకోట భవనాలకి కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. బ్రిటిష్ వాళ్ళ కాలములో ఈ కోటని ముఖ్యంగా ఒక సైనిక శిభిరముగా వాడారు. స్వాతంత్రం తరువాత కూడా, 2003వ సంవత్సరము వరకు, కోటలో ఎక్కువ భాగం, భారత సైన్యం ఆధ్వర్యంలోనే ఉండేది.
 
పంక్తి 30:
ఈ కోట [[యమునా నది]] ని ఆనుకొని ఉన్నది. ఈ నది నీరు కోట చుట్టూ త్రవ్వబడిన కందకాలకు చేరేది. కోటకి ఈశాన్యము మూలలో ఉన్న గోడ, 1546 సంవత్సరములో [[ఇస్లాం షా సూరి]] కట్టిన పాత రక్షణ కొటైన [[సలిమ్గార్ కోటకి]] ప్రక్కనే ఉంది.ఎర్ర కోట యొక్క నిర్మాణం 1638లో మొదలయి 1648లో ముగిసింది.
 
మార్చ్ 11,1783 నాడు [[సిక్కు]]లు స్వల్పకాలము ఢిల్లీలో[[ఢిల్లీ]]లో ఉన్న ఎర్ర కోటలోకి ప్రవేశించి, దివాన్-ఇ-అం ని ఆక్రమించారు. మొఘలు వజీరు తన సన్నిహితులయిన సిక్కులతో కలిసిపోయి నగరాన్ని వారికి అప్పగించారు. ఈ కార్యము కరోర్ సిన్ఘియా మిస్ల్కి చెందిన సర్దార్ [[బఘెల్ సింగ్]] ధలివాల్ సేనాధిపత్యంలో జరిగింది.
[[File:Historic Lal Quila, Delhi.jpg|thumb|left|భారత పతాకం ఢిల్లీ గేట్ నుండి ఎగురుతూ ఉంది]]
ఈ కోటలో నివసించిన ఆఖరి మొఘలు చక్రవర్తి [[బహదూర్ షా II]] "జఫర్". ఈ కోట మొఘల్ శక్తికి మరియు దాని రక్షణ సామర్ధ్యానికి కేంద్రముగా ఉన్నప్పటికీ, బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా 1857 సంవత్సరములో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు, ఎర్రకోటకి రక్షణ కల్పించలేదు. 1857 తిరుగుబాటు విఫలమైన తరువాత, 17 సెప్టెంబర్ నాడు జఫర్ కోటని వదిలి వెళ్లారు. ఆయన ఎర్రకోటకి బ్రిటిష్ వాళ్ళ ఖైదీగా తిరిగి వచ్చారు. జఫర్ మీద న్యాయ విచారణ 27 జనవరి, 1858 నాడు ప్రారంభమయి ఆయనను అక్టోబర్ 7 నాడు రాజ్యబహిష్కరణ చేశారు.
"https://te.wikipedia.org/wiki/ఎర్రకోట" నుండి వెలికితీశారు