అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
'''కావ్యగుచ్ఛము''' అనే మరో గ్రంథంలో తారాచంద్రుల ఇతివృత్తం, అష్టావక్రుని బ్రహ్మచార దీక్షకు పరీక్షాఘట్టం వంటి పలు ఇతివృత్తాలతో నిర్మించిన చిరు కావ్యాలు గుదిగుచ్చారు. '''విద్వద్దంపతీ విలాసము''' అనే మరో కావ్యంలో విదుషీమణి ఐన కాపుకులస్త్రీ, బ్రాహ్మణుడు ప్రేమించి ఫలించక మరణిస్తారు, తర్వాత ఈజిప్ట్ దేశంలో మళ్ళీ పుట్టి ప్రేమ ఫలింపజేసుకుంటారు. ఈజిప్టులో వారిద్దరి కలయికకు ఇతివృత్తాన్ని ప్రఖ్యాత [[అరేబియన్ నైట్స్]] లోని ఒక కథను తీసుకుని దాని అనుసృజనగా చేశారు. కాకతీయుల నాటి ఇతివృత్తంతో '''కుమార రుద్రదేవకవి''', '''బమ్మెర పోతన''', పౌరాణికాంశాలతో '''భారతీయ స్త్రీ ధర్మాలు''', '''శ్రీకృష్ణ చరిత్ర''' రాశారు. ఇవన్నీ వివిధ సంస్థలు ముద్రించినవి.<br />
సుబ్రహ్మణ్యశాస్త్రి రాసిన మహాకావ్యమైన భార్గవ రామచరిత్ర సహా ఏ రచనలూ జీవించివుండగా ప్రచురణకు నోచుకోలేదు. జీవించినంతకాలం ఇవి ముద్రితాలు కావాలని, పదుగురూ తన రచనలు చదవాలనీ కోరుకున్నారు. ఆయన మరణించాకా పలు సంస్థలు, వ్యక్తుల చొరవతో ఒక్కొక్కటిగా ఈ రచనలు ప్రచురితమయ్యాయి.
=== అముద్రిత గ్రంథాలు ===
అముద్రితమైన ఆయన రచనల్లో ఈ కిందివి ఉన్నాయి:
# పరశురామ చరిత్రము
# పరశురామ చరిత్రము (విమర్శ)
# రామ నివాసము
# పాల్కురికి సోమనాథకవి
# ప్రియదర్శిక
# మంగళ గౌరి
# శమంతకమణి
# శంకర జీవితము
# ఉషాపరిణయము
# కర్నూలు మండల చరిత్ర